Ad Code

Responsive Advertisement

శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి ఆలయం - తిరువణ్ణామలై.



పంచభూత క్షేత్రాలలో మూడవదైన తిరువణ్ణామలైలో అగ్నిలింగ రూపంలో వెలిసాడు. ఇక్కడ స్వామి వారికీ అరుణాచలేశ్వరుడు అని పేరు. ఇక్కడ అమ్మవారు ఉణ్ణామలై అమ్మన్.

ఈ క్షేత్రం పంచభూత క్షేత్రాలలో ఒక్కటిగానే కాకుండా, మహాలింగోద్బవం జరిగిన క్షేత్రంగా కూడా ఎంతో పురాణ ప్రసిద్ధి పొందింది. 

తమిళంలో 'అన్నాళ్' అంటే అగ్ని, కంటి, వెలుగు అని అర్ధాలు. ఈ క్షేత్రం అగ్నిరూపంలో వెలసిన పర్వతం కనుక దీనికి అన్నామలై అనే పేరు ఏర్పడింది. సంస్కృతంలో "శ్రీ" వచ్చే తమిళ పదమైన 'తిరు' చేరడంతో ఇది తిరువణ్ణామలై అయింది. 

ఈ ఆలయాన్ని చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు అభివృధి చేసారు. ముఖ్యంగా శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో ఆలయ రాజగోపురం, వెయ్యి స్తంభాల మండపం, ఉత్సవ మండపం నిర్మింపబడాయి. విలువైన ఆభరణాలు కూడా సమర్పించాడు.

ఈ ఆలయం దాదాపు 24 ఎకరాల స్థలంలో ఆరు ప్రాకారాలతో, ఎత్తైన గోపురాలతో, అద్భుతమైన శిల్పసంపదతో అలరారుతుంది. ఆలయ ప్రాంగణంలో ఉప ఆలయాలు, మండపాలు, అద్భుతమైన శిల్పాలు దర్శనమిస్తాయి. 

స్వామివారిని గర్భాలయంలో బంగారు కవచంతో అలంకరించి ఉంటారు. ఈ శివలింగాన్ని అర్చకులు తప్ప ఇతరులు ఎవరు ముట్టుకునే అవకాశం లేదు. స్వామివారి ఆలయానికి దగ్గరలోనే అమ్మవారి ఆలయం ఉంది.

గిరి ప్రదక్షిణ :

ఈ గిరిప్రదక్షిణ ఎంతో ప్రసిద్ధం. ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణ సుమారు 13 కి.మీ ఉంటుంది .ఈ మార్గంలో అష్ట లింగాలు అనేక ఆలయాలు కనిపిస్తాయి. ఈ ప్రదక్షిణ ఎంతో పుణ్యదాయకం అని చెప్పబడింది. ముఖ్యంగా ఆశ్వయుజ,కార్తీక, మార్గశిర మాసాలలో గిరిప్రదక్షిణ చేయడం అత్యంత ఫలప్రదం. 

ముఖ్యమైన పండుగలు :

ప్రతి మాసంలో ఉత్సవాలు జరుగుతుంటాయి.తమిళ కార్తీకమాసంలో జరిగే కార్తక దీపం ఉత్సవాలు ప్రముఖమైనవి. 

ఆలయ వేళలు :  

ఉదయం 5.00 నుండి మధ్యాహ్నం 12.00 వరకు
సాయంత్రం 03.30 నుండి రాత్రి 09.30 వరకు.

ఎలా వెళ్ళాలి :

వెల్లూరు నుండి 83 కి.మీ
చెన్నై నుండి 195 కి.మీ
కాంచీపురం నుండి 120 కి.మీ 

Post a Comment

0 Comments