- అయోధ్య భారతదేశంలోని అతిపురాతన నగరాలలో ఒకటి.అయోధ్య అంటే జయించశక్యం కానిది అని అర్ధం.ఇది ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాలో సముద్రమట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంటుంది.
- శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతోంది.
- ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటి.
- పూర్వకాలంలో అయోధ్య నగరం కోసలరాజ్యానికి రాజధానిగా ఉండేది.
- రామాయణం ప్రకారం ఈ నగరం 9,000 సంవత్సరాలకు పూర్వం, వేదాలలోమొదటి పురుషుడుగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్టుగా పేర్కొన్న మనువు చేత స్థాపించబడింది.
- సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కొసలదేశానికి అయోధ్య రాజధాని.
- స్కంద పురాణంతో పాటు ఇతర పురాణాలు భారతదేశంలోని ఏడు మోక్షాన్ని ఇచ్చే నగరాలలో అయోధ్య ఒకటి అని చెప్తున్నాయి.
- అధర్వణ వేదం అయోధ్య దేవనిర్మితమని అది స్వర్గసమానమని పేర్కొన్నది.
- ఈ నగరాన్ని సూర్యవంశ రాజైన వైవసత్వ మనువు కుమారుడైన ఇక్ష్వాకు నిర్మించి పాలించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది.
- సూర్యవంశంలోని 31వ రాజు హరిశ్చరంద్రుడు ఈ రాజ్యాన్ని పాలించారు. హరిశ్చంద్రుడు సత్యవాక్పరిపాలనకు ప్రసిద్ధి చెందిన వాడు.
- రఘుమహారాజు రాజ్యావిస్తరణ చేసి సూర్యంశంలో మరో వంశకర్త అయ్యాడు.
- రఘుమహారాజు తరువాత సూర్యవంశం రఘువంశంగా కూడా పిలువబడింది. రఘుమహారాజు మనుమడు దశరథుడు. దశరథుడి కుమారుడు రామచంద్రుడు.
- వాల్మికి రచించిన రామాయణ మాహాకావ్యం మొదటి అధ్యాయాలలో అయోధ్య మహోన్నతంగా వర్ణించబడింది. అంతేకాక కోసల సామ్రాజ్యవైభవం, రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, సంపద, ప్రజల విశ్వసనీయత గురించి గొప్పగా వర్ణించబడింది.
- తులసీ దాసు రచించిన రామచరితమానస్‍లో అయోధ్య వైభవం వర్ణించబడింది.
- తమిళకవి కంబర్ వ్రాసిన కంబరామాయణంలో కూడా అయోధ్య అత్యున్నతంగా వర్ణించబడింది.
- తమిళ వైష్ణవ భక్తులైన ఆళ్వారులు ఈ నగరాన్ని తమ రచనలలో అద్భుతంగా వర్ణించారు.
- జడభరత, బహుబలి, సుందరి, పాడలిప్తసురీశ్వరి, హరిచంద్ర, అచలభరత మొదలైనవారు అయోధ్యలో జన్మించిన వారే.
అయోధ్య వివాదం
మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ ఇదే స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాడు. దీన్ని ఆయన అంతకు ముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని కొందరి వాదన. 1992 వ సంవత్సరంలో రామ భక్తులు, దేశం నలుమూలల నుండి తరలివచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి కొన్ని హిందూ సంస్థల నేతృత్వంలో కూల్చివేయడం జరిగింది.
ప్రస్తుత స్థలం రామ మందిర నిర్మాణానికి సుప్రీమ్ కోర్ట్ అనుమతిస్తూ తీర్పు ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
0 Comments