Ad Code

Responsive Advertisement

శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం - వేములవాడ

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందింది.ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా లో ఉంది. దీనిని హరి హర క్షేత్రంగా పిలుస్తారు.



క్రీ.శ. ఎనిమిదో శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించినట్లు తెలుస్తుంది.

భావిస్యోత్తర పురాణం ప్రకారం ఇక్కడ సూర్య భగవానుడు ఆరోగ్య సమస్య నుంచి కోలుకుంటాడు అందుకే దీనిని భాస్కర క్షేత్రం అని అంటారు. అష్టదిక్పాలకులు రాజు అయిన ఇంద్రుడు ఇక్కడ స్వామి వారిని ప్రాడించడం వల్ల బ్రహ్మహత్యా దోషం నుంచి రక్షించబడతాడు. 

అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని స్థలపురాణం.

ఆలయ ప్రత్యేకత: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ధర్మగుండంలో పుణ్యస్నానం చేసి కోడెమొక్కు చెల్లించడం ఈ ఆలయ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాతే భక్తులు స్వామిని దర్శించుకొని ప్రధాన పూజలైన కల్యాణం, అభిషేకం, అన్నపూజ, కుంకుమ పూజ, ఆకుల పూజ, పల్లకిసేవల వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తుల్లో చాలామంది స్వామివారికి తమ తలనీలాలు సమర్పించి తమ ఎత్తు బంగారాన్ని(బెల్లం) స్వామికి మొక్కుగా చెల్లించి.. ఆపై దాన్ని స్వామి ప్రసాదంగా పంపిణీ చేస్తారు.

ఆలయప్రాంగణంలోని ఉప ఆలయాలు : 

రామాలయం, అనంతపద్మనాభస్వామి ఆలయం, బాలా త్రిపురసుందరీదేవి ఆలయం, మహిషాసురమర్ధిని ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం.

ఆలయ వేళలు : ఉదయం 6.00  నుండి రాత్రి 9.00  వరకు 

ఆలయంకి ఎలా వేలాలి :

రోడ్ మార్గం ద్వారా అయితే హైదరాబాద్ నుండి 150 కి.మీ దూరంలో, కరీంనగర్ నుండి 34 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం.

కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి 47 కి.మీ దూరం. అక్కడ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి.

ముఖ్యమైన పండుగలు/ పర్వదినాలు :

మహాశివరాత్రి  ముఖ్యమైన పండుగ .భోగి , మకర  సంక్రాంతి , రథ  సప్తమి , భీష్మ  ఏకాదశి ,ఉగాది , శ్రీ  రామ  నవమి , హనుమాన్  జయంతి , వరలక్ష్మి  వ్రతం , కృష్ణాష్టమి , వినాయక 
 చవితి ,దసరా  నవరాత్రులు , దీపావళి.

వసతి సౌకర్యం :  50 రూ  నుండి  వరకు 2000 రూ దేవస్థానం వారి రూములు అందుబాటులో ఉన్నాయి.

Post a Comment

0 Comments