- ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమిరోజున బంగారు వాకిలిముందు శ్రీరాములవారికి ఆస్థానం జరుగుతుంది.
- ఆ రోజు హనుమంత వాహనంపై స్వామివారి ఊరేగింపు జరుగుతుంది.
- బంగారువాకిలి వద్ద సర్వభూపాల వాహనంలో శ్రీ సీతారామలక్ష్మణులకు, హనుమంతునికి ఆస్థానం నివేదనలు జరుగుతాయి.
- శ్రీ రామాయణంలోని శ్రీరామ జన్మవృత్తాంతం పురాణ ప్రవచనం జరుగుతుంది.
- మంగళ నీరాజనాలతో ఆస్థానం ముగుస్తుంది.
శ్రీరామ పట్టాభిషేకం
- శ్రీరామనవమి తరువాత రోజు అనగా చైత్ర శుద్ధ దశమిరోజు తిరుమల పురవీధుల్లో శ్రీ సీతారామ లక్ష్మణులకు - అభిముఖంగా మరొక పీఠంపై ఆంజనేయుడు ఊరేగింపబడతాడు.
- బంగారు వాకిలిముందర శ్రీ సీతారామ లక్ష్మణులకు వీరికి ప్రక్కన ఒక్కొక్క పీఠంపై సుగ్రీవ, అంగద, హనుమంతులకు ఆస్థానం జరుగుతుంది.
- నివేదన కార్యక్రమాలు అయిన తర్వాత శ్రీరామజననం నుండి పట్టాభిషేకం వరకు కథను ప్రవచనం చేస్తారు.
- మంగళ నీరాజనము, పట్టాభిషేకం ఉత్సవం ముగుస్తుంది.
- తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది.
0 Comments