- సూర్యుడు నక్షత్రాలలో చేసే గమనం ఆధారంగా ఇవి ఏర్పడుతాయి.
- భరణి మూడు నాలుగు పాదాలలో, కృత్తిక నాలుగు పాదాలు, రోహిణి మొదటి పాదంలో సూర్యుడు ఉండే కాలాన్ని కర్తరి అని అంటారు.
- కర్తరిలు రెండు రకాలు డొల్లుకర్తరి లేదా చిన్నకర్తరి, నిజకర్తరి లేదా అగ్నికర్తరి.
- సూర్యుడు భరణి మూడు నాలుగు పాదాలలో సంచరించే సమయాన్ని డొల్లుకర్తరి అని అంటారు. సాధారణంగా మే మొదటి వారం లేదా 4 , 5 తేదీలలో ఇది ప్రారంభం అవుతుంది.
- డొల్ల అంటే ఖాళీ అని అర్ధం. ఈ కాలంలో చేసే కొన్ని పనులకు పెద్దగా దోషం ఉండదు అని అంటారు.
- సూర్యుడు కృత్తిక నక్షత్రంలో ఉంటే నిజకర్తరి ప్రారంభం అవుతుంది. ఇది సాధారణంగా మే రెండవ వారం లేదా 11 , 12 తేదీలలో మొదలు అవుతుంది.
సూర్యుడు భరణి, కృత్తిక నక్షత్రాలలో ఉండే కాలంలో ఉపనయనం, వివాహం లాంటివి చేయవచ్చు.
చేయకూడనివి
వ్యవసాయ పనులు ప్రారంభించటం, విత్తనాలు జల్లటం, చెరువులు బావులు లాంటివి తవ్వించటం, కొత్త ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించటం, చెట్లు కొట్టేయటం లాంటివి చేయకూడదు.
0 Comments