• చైత్ర మాసం బహుళ ఏకాదశికి వరూధిని ఏకాదశి అని పేరు. 
  • ఈ ఏకాదశి గురించి భావిస్యోత్తర పురాణంలో చెప్పబడింది.
  • ఈ ఏకాదశి వ్రతపాలన వల్ల ద్వారా మనిషి నిరంతర సుకం పొందుతాడు.
  • స్త్రీలు సౌభాగ్యవంతురాలు అవుతారు, పురుషులు ధన సంపదలు పొందుతారు
  • మాంధాత ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం ద్వారా ముక్తుడయ్యాడు 
  • ఈ ఏకాదశి ఆచరణ వల్ల మనిషి పదివేల సంవత్సరాల తపఃఫలాన్ని పొందుగలుగుతాడు.
  • కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో నలభై కిలోల బంగారాన్ని దానం చేస్తే వచ్చే పుణ్యఫలం కేవలం ఈ ఏకాదశి వ్రత పాలనా ద్వారా మానవుడు సాదించగలుగుతాడు.
  • ఈ ఏకాదశి రోజున మేల్కొని ఉండి జనార్దుని సేవించేవాడు సమస్త పాపాలు దూరమై జీవిత లక్ష్యాన్ని సాధిస్తాడు.
  • ఈ ఏకాదశి మహిమ వినేవాడు, చదివేవాడు వేయిగోవుల దానఫలితాన్ని పొందుతాడు , పాపవిముక్తుడై విష్ణుపదాన్ని చేరుకుంటాడు. 

2021 : మే  7.