Ad Code

Responsive Advertisement

శని త్రయోదశి

త్రయోదశి తిధినాడు శనివారం వస్తే ఆ రోజు శని త్రయోదశి అవుతుంది. ఆ రోజు శనిభగవానుడిని  విశేషంగా పూజిస్తారు.

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకల్పము ప్రకారం శని పుష్యమాసంలోని శుక్ల పక్షంలో నవమి తిధినాడు జన్మించాడు. ఆ రోజు శనివారం, భరణి నక్షత్రంలో శని జన్మించాడు.

శాంతిపీఠికలోని వివరాలు మరోరకంగా చెబుతున్నాయి. మహాతేజస్సుతో వెలుగొందే శని నిలవర్ణంలో ఉంటాడు. అయన ఛత్రం రంగు కూడా నీలమే. ఇక్కడ నిలవర్ణం అంటే నలుపు అని అర్ధం. అయన సౌరాష్ట్ర దేశంలో జన్మించాడు. అతనిది కాశ్యపస గోత్రం. మాఘ బహుళ చతుర్దశినాడు శని జన్మించాడు.

ఉత్తర భారతదేశంలో శనిత్రయోదశినాడు కాకుండా అమావాస్యనాడు నిర్వహించుకుంటారు. పుర్ణిమాంత పంచాంగాలను అనుసరించి జ్యేష్ఠా అమావాస్య నాడు శనిజయంతి.

తెలుగు పంచాంగాల ప్రకారం వైశాఖ అమావాస్యనాడు వస్తుంది.

త్రయోదశి, చతుర్దశి, అమావాస్య తిధులు శని ఆరాధనకు తగినవని మనకు   తెలుస్తుంది.

శని త్రయోదశి నాడు శనిని పూజిస్తే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఏలినాటి శని, అష్టమ, అర్ధాష్టమ శని జరుగుతున్న రాశులు వారు శనిని ఆరాధించాలి.

శని మహర్దశ లేదా అంతర్దశ జరుగుతున్న వారుగాని, జాతకంలో శని చేదు స్థానాలలో ఉండగా జన్మించినవారు గాని ఉంటే తప్పనిసరిగా శని త్రయోదశి నాడు శని దోష పరిహారం పూజ చేయాలి.
  • శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి.
  • స్నానం చేసి తెలుపు రంగు నూలు వస్త్రాలు ధరించాలి.
  • దేవాలయానికి వెళ్లి నవగ్రహ మండపంలో శని భగవానునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి.
  • నల్ల నూలు వస్త్రం సమర్పించాలి, నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి , నీలిరంగు పుష్పాలతో పూజ చేయాలి.
  • నల్ల నువ్వులు, బెల్లంతో తయారుచేసిన చిమ్మిలిని నైవేద్యంగా సమర్పించాలి.
  • అవకాశం ఉన్నవారు నల్ల నువ్వులు, బియ్యము దానముగా సమర్పించాలి. 
  • కాకికి అన్నము లేదా బెల్లము నైవేద్యం పెట్టాలి.

ప్రతి వ్యక్తి జీవితంలో సగటున ముప్పై ఏళ్లకోసారి ఏలినాటి శని వస్తుంది. అది ఏడున్నర సంవత్సరాల కనీసంగా ఉంటుంది. అంత మాత్రం చేత భయపడల్సిన అవసరం లేదు.

2021 : మే 8.

Post a Comment

0 Comments