- ఆశ్వయుజ పూర్ణిమ నాడు చంద్రుడు అశ్వినీ నక్షత్రంతో కలిసి ఉంటాడు.సౌర మానంలో దీన్నే తులాపూర్ణిమ అంటారు.
- ఈ తులామాసంలో జగన్మాతను ఆరాధించాలి.
- ఈ రోజున అధికమైన కాంతి కలిగిన వెన్నల ఉంటుంది.అందుకే దీనిని కౌముది పూర్ణిమ అని కూడా అంటారు.
- ఈ రోజు ధ్యానం చేస్తే సాధకుని మనస్సు సంకల్ప వికల్పాలకు అతీతమవుతుంది. శివశక్తి సామరస్యాన్ని దర్శించే సామర్ధ్యం పెంపొందుతుంది.
- ఈ రోజున కౌముద్యుత్నవము, అక్షక్రీడ కోజాగర్తి వ్రతము. లక్ష్మీపూజ, ఇంద్రపూజ, కుబేరపూజ, చంద్ర పూజ చేయాలి.
- లక్ష్మీ, కుబేరుడు, ఇంద్రులను రాత్రి సమయంలో పూజిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి.
- ఈ రోజు లక్ష్మి అనుగ్రహం కోసం గవ్వలాట(అక్ష క్రీడ) ఆదుకోవాలి.
- జాగరణ వ్రతం చేయాలి, జాగరణలో వున్నవారిని లక్ష్మీదేవి కటాక్షిస్తుంది.
- ఆవు పాలతో ఆరుబయట వెన్నెల్లో క్షీరాన్నం తయారుచేస్తారు.
- ప్రకాశవంతమైన చంద్రుని అమృత కిరణాలు ఆ పాయసంలోకి నేరుగా ప్రసరిస్తాయి.
- దానిని లక్ష్మీదేవికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. దీనివల్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వృద్ధి పొందుతాయి.
- ఆశ్వయుజ పూర్ణిమ నాడు గొంతెమ్మరూపంలో ఉన్న కుంతీదేవిని ఆరాధించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది.
- ఈ రోజున దానం చేస్తే అభీష్టసిద్ధి, ఉత్తమలోక ప్రాప్తి కలుగుతాయి.
2021 : అక్టోబర్ 19.
0 Comments