Ad Code

Responsive Advertisement

శ్రీ గురుచరిత్ర - పారాయణ నియమాలు, పద్ధతులు

 

  • శ్రీ గురుచరిత్ర పారాయణ చేయదలచినవారు ఉదయం తలంటు  స్నానం చేయాలి.
  • ఉదయం నుండి ఏమీ తినకుండా భగవంతుని ముందు కూర్చుని, దీపారాధన చేసి పారాయణ మొదలు పెట్టాలి.
  • శ్రీ గురుచరిత్ర పారాయణం ఏ వయస్సులో ఉన్న స్త్రీ, పురుషులైనా చేయవచ్చు
  • పారాయణ చేసే రోజు మద్యం, మాంసం ముట్టుకోరాదు.పగలు నిద్రపోరాదు 
  • ఒకే ఒక్కరోజులో శ్రీ గురుచరిత్రను పారాయణం చేయదలచుకున్నవారు పాలు పండ్లు ఆహారంగా తీసుకోవచ్చు.
  • ఈ పారాయణాన్ని ఒక వారములో పూర్తి చేయలేనివారు రెండు వారములు గాని, మూడు వారములలో గాని పూర్తి చేసుకోవచ్చు. లేక రోజుకొక అధ్యాయము చొప్పున పారాయణ చేసుకోవచ్చు.
  • ఏదైనా ఒక సంకల్పాన్ని కోరుకుని, దాన్ని సాధించాలనుకున్నవారు ప్రతి గురువారం వరుసగా ఒక ఐదు వారాలు పారాయణ చేస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి.
  • సంవత్సరంలో ఒక్కరోజు అయినా శ్రీ సాయిబాబా పుణ్య తిథినందు శ్రీ గురుచరిత్ర పారాయణ చేయడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.
  • ప్రతి నెలలో ఒక గురువారం గాని, ఏకాదశి రోజునగాని, పూర్ణిమ రోజునగాని పారాయణ చేయవచ్చును..
  • ఆరోగ్యం బాగాలేనివారు, స్వయంగా పారాయణ చేయలేనివారు శ్రీ గురుచరిత్ర పారాయణ విన్నా మంచి ఫలితముంటుంది.
  • శ్రీ గురుచరిత్రలోని అధ్యాయాలన్నీ ఒకే ఆసనంమీద కూర్చుని పూర్తి అయ్యేటంతవరకు చదవాలి.
  • పారాయణం అయిపోయిన తర్వాత పటికబెల్లం, అరటిపండు, ఖర్జూరపండ్లు దేనితోనయినా నివేదన చేయాలి
  • శ్రీ గురుచరిత్ర పారాయణం వలన మనకు శుభం కలగాలనే కోరిక గలవారు, ఈ క్రింది నియమములను తప్పకుండా పాటించి తీరాలి.
  • పారాయణ చేస్తున్నంత కాలం బియ్యం, పెసరపప్పు, దంచిన బెల్లం, నెయ్యివేసి ఎసరు వార్చకుండా ఉడకబెట్టినది తినాలి. దానితో రొట్టె కూడా తినవచ్చు
  • బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించి తీరాలి. 
  • చాపమీద పడుకోవాలి పారాయణం పూర్తిచేసిన తరువాత బీదవారికి భోజనం పెట్టాలి. 
  • ఏదైనా అవాంతరం వలన పారాయణ చేయడానికి వీలులేనివారు శ్రీ దత్త - జయదత్త అని ప్రతిరోజు జపం చేయవచ్చు.

Post a Comment

0 Comments