- కాశీ అంటే నిత్యం ప్రకాశించే నగరమని అర్ధం.
- కాశీలో మరణిస్తే పునర్జన్మ ఉండదు అని విశ్వసిస్తారు.
- కాశీక్షేత్రం కైలాస సమానం అని భక్తుల నమ్మకం.
- గంగలో పుణ్యస్నానంలో చేసిన వెంటనే కాశీవిశ్వనాధుని దర్శించుకుంటారు.
- కాశీలో పురాణ, చారిత్రిక నేపథ్యం కలిగిన 87 ఘాట్లు ఉన్నాయి.
- బ్రహ్మ దేవుడు శివానుగ్రహం కోసం పది అశ్వమేధయాగాలు నిర్వహించింది దశాశ్వమేధ ఘాట్.
- శివుడి కర్ణకుండలాలు పడిన ప్రదేశం మణికర్ణికా ఘాట్. ఈ ఘాట్ లోనే ఎక్కువ దహన సంస్కరాలు జరుగుతాయి.
- అత్యధిక ఆలయాలు కలిగిన ఘాట్ సింధియా ఘాట్.
- అస్సి ఘాట్, అహల్య ఘాట్, బద్రినారాయణ ఘాట్, దుర్గ ఘాట్, హనుమాన్ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, కేదార్ ఘాట్, లలిత ఘాట్, తులసి ఘాట్, వేణి మాధవ ఘాట్ వాటిలో ప్రముఖమైనవి మరియు ఎన్నో తీర్దాలు దర్శనమిస్తాయి.
- ప్రసిద్ధమైన దశాశ్వమేధ ఘాట్ లో ఇచ్చే గంగ హారతి కన్నుల పండుగగా ఉంటుంది.
- రుద్రా, నాగ ,త్రిశుల, ధూప, పంచ, నక్షత్ర హారతులు సమర్పిస్తారు.
- కాశీవిశ్వనాధుని ఆలయంకి సమీపంలోనే అన్నపూర్ణాదేవి దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిని దర్శించుకుంటే అన్నపానాలకు లోటు ఉండదు అని భక్తుల విశ్వాసం.
- దీపావళి తరువాత రోజు బంగారు అన్నపూర్ణాదేవిని దర్శించవచ్చు.
- అష్ఠాదశ శక్తిపీఠాలలో ఒక్కటైనా విశాలాక్షి అమ్మవారి మందిరం దర్శించవచ్చు. ఇక్కడ అమ్మవారు స్వయంభు.
- విశ్వభుజ గౌరీ, సౌభాగ్య గౌరీ, శృంగార గౌరీ , ముఖనిర్మల గౌరీ, మంగళ గౌరీ, మహాలక్ష్మి గౌరీ, లలిత గౌరీ, జ్యేష్ఠా గౌరీ, మణికర్ణికా దేవి, వింద్యాదేవి, వారాహిదేవి, త్రిపురభైరవి, త్రిలోకసుందరి, సిద్దేశ్వరి, దుర్గాదేవి, నవదుర్గల ఆలయాలు దర్శించవచ్చు.
- పాలరాతితో నిర్మించిన బెనారస్ విశ్వనాథ మందిరం వారణాసి క్షేత్రంలోనే అతి ఎత్తైన ఆలయం.
- ఈ నగరంలో 57 గణపతులని దర్శించవచ్చు. వాటిలో చింతామణి గణపతి దుండి గణపతి ప్రముఖమైనవి.
- కాశీలో సూర్య భగవానుడికి 12 ఆలయాలు ఉన్నాయి.
- శ్రీ మహావిష్ణువుకు 27 ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది బింధుమాధవస్వామి ఆలయం.
- క్షేత్రపాలకుడైన కాలభైరవుడికి 8 ఆలయాలు ఉన్నాయి.
- ఇక్కడ సంకట మోచన్ హనుమాన్ ఆలయం విశిష్టమైనది. ఇక్కడ తులసీదాస్ రామచరితమనస్ రాసినట్లు చారిత్రిక కధనం.
- తిలబండేశ్వర్ మహాదేవ ఆలయం, కేదారేశ్వర మందిరం కూడా తప్పనిసరిగా దర్శించవచ్చు.
0 Comments