• శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మహారాష్ట్ర రాష్ట్రంలోని కొల్హాపురిలో కొలువైన అష్ఠాదశశక్తిపీఠం ఇది. 
  • ఇక్కడ అమ్మవారిని అంబాబాయి అని పిలుస్తారు, కరవీరావాసాని అని స్థానికులు పేర్కొంటారు.
  • ఇక్కడ సతీదేవి నేత్రాలు పడినట్లుగా చెప్పబడింది.
  • ముక్తిని ప్రసాదించే ఆరు క్షేత్రాలలో ఈ కరవీరక్షేత్రం కూడా ఒకటి. మిగతావి విరూపాక్షం (హంపి), శ్రీశైలం, పండరీపురం, శ్రీరంగం, రామేశ్వరం. 
  • ఈ ఆలయం మహారాష్ట్ర నిర్మాణ శైలిలో గొప్పగా కనిపిస్తుంది.
  • ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహశిలను ఎంతో ప్రశస్తమైన మణిశిలగా పేరుకుంటారు. 
  • అమ్మవారు సింహవాహనంపై నాలుగు చేతులతో చేరుకువిల్లు, ఫలం, డాలు, కలశాన్ని ధరించి ఉంటుంది.
  • అమ్మవారి శిరస్సుపై అయిదు తలల ఆదిశేషుడు ఛత్రం పడుతున్నట్లుగా ఉంటాడు.
  • నల్లని ముఖంతో అనేక ఆభరణాలతో అలరారే ఈ అమ్మవారిని దర్శించేందుకు రెండు కన్నులు చాలవు అని భక్తుల అనుభవం.
  • ఈ ఆలయానికి మరో విశేషం కూడా వుంది. ఉత్తరాయణంలో జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీలలోనూ, దక్షిణాయణంలో నవంబరు 9, 10, 11 తేదీలలోనూ సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు మూల విరాట్టుపై పడుతాయి.

స్థలపురాణం ప్రకారం పూర్వం కొల్హుడు అనే రాక్షసుడు బ్రహ్మచేత  యుద్ధంలో సులభంగా విజయం లభించే వరాన్ని పొందాడు. ఆ వరంతో అన్ని రాజ్యాలను జయించాడు. తరువాత యితర లోకాలను ఆక్రమించేందుకు బయలుదేరిన కొల్హుడు రాజ్యభారాన్ని తన పెద్ద కుమారుడైన కరవీరునికి అప్పగించి, మిగిలిన  తన ముగ్గురు కుమారులను అతనికి సహాయకులుగా నియమించాడు.


కరవీరుడు అతని ముగ్గురి కుమారులు కూడా జనాలను బాధపెడుతూ, ఋషులను, మునులను బాధిస్తూ, యజ్ఞయాగాదులను ధ్వంసం చేయసాగారు.


దాంతో దేవతల కోరిక మేరకు పరమేశుడు కరవీరుని, అతని ముగ్గురు సోదరులను అంతమొందించాడు.


తన కుమారుల మరణానికి ఎంతగానో పరితపించిన కొల్హుడు  రాజ్యానికి తిరిగివచ్చి, దేవతలపై పగ పెంచుకుని, ప్రతీకారంతో వారిని హింసించడం సాగాడు.


చివరకు దేవతల ప్రార్ధన మేరకు మహాలక్ష్మి స్వరూపంలో ఆదిపరాశక్తి కొల్హుడు సంహరించింది.


కొల్హుడు చివరి కోరిక మేరకు మహాలక్ష్మి కొల్హాపురంలోనే కొలువుతీరిందని, కొల్హుడు చంపబడిన ఈ ప్రాంతం కొల్హాపురంగా పేరొందిందని చెబుతారు.

ఆలయ వేళలు 



ఉదయం 4.30 నుండి రాత్రి 10.30  వరకు.



గర్భాలయంలోకి పురుషులను మాత్రమే అనుమతిస్తారు. స్త్రీలకు గర్భాలయ ప్రవేశం లేదు. 



పూజ సమయాలు 



ఉదయం 4.30 -  ఆలయం తెరుస్తారు 

ఉదయం 4.30 - 6.00 - కాకడ ఆరతి 

8.00 - ఉదయం మహాపూజ

9.30 - నైవేద్యం 

11.30 - మధ్యాహ్నం మహాపూజ

మధ్యాహ్నం 1.30 - అలంకార పూజ

రాత్రి 8.00 - ధూప్ ఆరతి 

రాత్రి 10.00 - శేజ్ ఆరతి 



ముఖ్య పండుగలు 


ఏప్రిల్ మాసంలో రథోత్సవం, అక్టోబర్ మాసంలో నవరాత్రి ఉత్సవాలు, జనవరి,నవంబర్ మాసాలలో కిరణోత్సవాలు.



ఎలా వెళ్ళాలి 



ముంబై నుండి 375 కి.మీ 

పూణే నుండి 230  కి.మీ.