• పూర్వం శబరిమల వెళ్లాలంటే ఎరుమేలి మార్గం ఒక్కటే శరణ్యమయ్యేది.క్రూరమృగాల భయంతో అంతా కలిసి బృందాలుగా తరలి వెళ్లేవారు. 
  • 1819 వ సంవత్సరంలో ఆలయాన్ని 70 మంది భక్తులు సందర్శించారు.అప్పటి సంవత్సరం ఆలయాదాయం కేవలం 7 రూపాయలు.
  • 1907 వ సంవత్సరం వరకూ ఆలయం పాకల్లో ఉండేది.దాంతో ఆలయంలో మూడుసార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి.
  • 1907, 1909, 1950 సంవత్సరాల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. 1909లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో రాతితో నూతన ఆలయాన్ని నిర్మించారు. పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టించారు.
  • అప్పటి నుంచి ఆలయ వైభవం ఇనుమడించింది. భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. 1950లో తిరిగి అగ్నిప్రమాదం జరిగి ప్రస్తుతం దర్శనమిచ్చే ఆలయం తయారైంది.
  • స్వామి పంచలోహ విగ్రహ మూర్తి చెంగనూరు చెందిన అయ్యప్పన్, నీలకంఠన్ అనే శిల్పులు తయారు చేశారు. శ్రీ శంకర తాంత్రి స్వామి చేతుల మీదుగా 1951లో స్వామి ప్రతిష్ఠితుడయ్యాడు.
  • 1935 వరకు ఆలయ నిర్వహణ తిరువాన్కూర్ మహారాజ సంస్థానాధీశుల ఆధ్వర్యంలోనే నడిచింది. 1935 లో దేవస్థానం బోర్డు  ఆధీనంలోకి వచ్చింది.
  • అప్పట్లో ఆలయాన్ని కేవలం జ్యోతి దర్శన సమయంలో మాత్రమే తెరిచే వారు.1940 నుంచి భక్తుల సంఖ్య క్రమేపీ పెరిగింది. దీంతో మండల పూజల సమయంలో కూడా ఆలయాన్ని తెరవడం మొదలుపెట్టారు.
  • 1945 నాటికి భక్తుల సంఖ్య అధికం కావడంతో విషు, పంక్తుల ఉత్సవం. ఓణం సందర్భాల్లో కూడా ఆలయాన్ని తెరిచే వారు.
  • 1950 తరువాత నుంచి మాస పూజల కోసం మాస ఆరంభంలో తెరిచే వారు. మొదట్లో మూడు రోజులు తెరిచిన ఆలయాన్ని ప్రస్తుతం ప్రతినెల 5 రోజులు తెరుస్తున్నారు. ఈ సమయంలో కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. 
  • 1984 వరకూ ఆలయం ముందున్న పదునెట్టాంబడి రాతి మెట్లతోనే ఉండేది. భక్తులు తాము దర్శనం చేసుకునే సంవత్సరాన్ని బట్టి ఆ సంఖ్యకు తగిన విధంగా మెట్లపై కొబ్బరి కాయలు కొట్టేవారు. అందువల్ల రాతి మెట్లు కొంతమేరకు దెబ్బతిన్నాయి. భక్తులు ఎక్కేందుకు ఇబ్బందిగా కూడా ఉండేది.
  • దాంతో 1985లో పదునెట్టాంబడి పంచలోహ తాపడం చేశారు. కొబ్బరికాయలను మెట్లకు ఇరువైపులా కొట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు.పదునెట్టాంబడి పై కప్పు ఏర్పాటు చేశారు.
  • 1985 నుంచి భక్తులకు వసతి సౌకర్యాలు పెరిగాయి. 90లో మధ్య శబరిమల, పంబా మార్గంలో కాంక్రీటు రోడ్డు వేశారు.
  • 2000 వ సంవత్సరంలో ఒక భక్తుడు స్వామి గర్భాలయానికి బంగారు రేకులతో తాపడం చేయించాడు.