- ఆదివారం నాడు స్వామిని ఎర్ర కలువలతో పూజిస్తే సార్వభౌమత్వం సిద్ధిస్తుంది.
- సోమవారం నాడు కరవీరపుష్పాలతో, కస్తూరీకుసుమాలతో పూజించినవారికి సత్యలోక ప్రాప్తి కలుగుతుంది.
- గురువారం నాడు అరుణాచలేశ్వరుణ్ణి తెల్ల తామరలతో అర్చిస్తే సిద్దులతో కూడిన జనోలోకానికి వెళతారు
- శుక్రవారం నాడు చంపక పుష్పాలు అరుణగిరినాథుణ్ణి పూజించినవాడికి బ్రహ్మర్షులతో నిండిన తపోలోకంలో నివసించే అవకాశం దక్కుతుంది.
- శనివారం నాడు జాజీ, మల్లికా పుష్పాలతో స్వామిని అర్చిస్తే మహాపాపాలు చేసిన వాడైనా సరే యమలోకాన్ని చూడడు.
తిథులు - నైవేద్యాలు
- పాడ్యమినాడు అరుణాచలేశ్వరుడికి పాయసాన్ని నివేదించిన వాడికి ధనధాన్య సమృద్ధి కలుగుతుంది.
- విదియనాడు దధ్యోదనం స్వామికి నివేదిస్తే వారికి భోగభాగ్యాలు లభిస్తాయి.
- తదియనాడు అరుణగిరీశ్వరుడికి అపూపాలు నివేదన చేసిన వారు జీవితాంతం దృఢమైన శరీరంతో ఆరోగ్యంగా ఉంటారు.
- చతుర్ధినాడు పూర్ణకుంభాలు స్వామికి సమర్పించినవాడు సకల కామ్యాలనీ సిద్ధింప చేసుకుంటాడు.
- పంచమినాడు పులగాన్ని స్వామికి నివేదిస్తే అక్షయ భోగాలు కలుగుతాయి.
- షష్ఠినాడు చక్కెర పొంగలిని స్వామికి నివేదించాలి. అలా చేసినవాడి సంతానం అవిచ్ఛన్నంగా కొనసాగుతుంది.
- సప్తమి తిథినాడు నువ్వుల అన్నాన్ని అరుణగిరి నాథుడికి నైవేద్యం పెడితే మానవులు సమస్త ఋణాల నుంచి విముక్తి పొందుతారు.
- అష్టమినాడు రాజనాలబియ్యంతో అన్నం వండి నైవేద్యం పెడితే,రాజవశ్యం కలుగుతుంది.
- నవమి తిథి లో గోధుమాన్నాన్ని శోణగిరినాథుడికి నివేదించాలి. అలా చేసినవారికి రాజయక్ష్మాది రోగబాధలు వుండవు.
- దశమినాడు అన్నిరకాల కూరలు కలిపి వండిన కదంబాన్ని స్వామికి సమర్పిస్తే సకల లోక ప్రియులవుతారు.
- ఏకాదశి తిథి నాడు అరుణాచలేశ్వరుడికి అటుకులు నైవేద్యం పెట్టాలి.తద్వారా ఆయన అభయం మానవులకి లభిస్తుంది.
- ద్వాదశినాడు పప్పన్నం స్వామికి నివేదిస్తే కోరిన కోరికలన్నీ సిద్దిస్తాయి.
- త్రయోదశి తిథి ఉన్నరోజు సత్తుపిండిని అరుణగిరి నాథుడికి నివేదించాలి.దానివల్ల శాంతితో కూడిన జీవితం లభిస్తుంది.
- చతుర్దశినాడు వివిధరకాల ఫలాల్ని స్వామికి నివేదించాలి. అలా చేసినవాడు మూర్ఖుడైనా సరే మహా పండితుడౌతాడు.
- పౌర్ణమి పర్వదినాన పనసపండుని అరుణాచలేశ్వరుడికి నైవేద్యం పెట్టాలి.అలా చేసిన వారికి కంటి జబ్బులు తొలగిపోతాయి
- అమావాస్య నాడు కందమూలాల్ని తెచ్చి స్వామికి సమర్పించాలి. తద్వారా సమర్పించిన వాడి పితృదేవతలు సంతోషిస్తారు.
0 Comments