Ad Code

Responsive Advertisement

కాలాష్టమి

 


  • కాలాష్టమి రోజున కాలభైరవుడిని పూజిస్తారు.
  • ఏడాదికి 12 కళాష్టమిలు వస్తాయి.
  • ప్రతి నెల కృష్ణపక్షంలోని అష్టమి తిధి రోజున జరుపుకుంటారు అంటే  పౌర్ణమి తరువాత ఎనిమిదవ రోజు జరుపుకుంటారు.
  • కాలభైరవుడు శివుని అవతారం
  • కాలాష్టమి గురించి ఆదిత్య పురాణంలో చెప్పబడింది.
  • ఆదివారం లేదా మంగళవారం వచ్చే కాలాష్టమికి ప్రాధాన్యత ఎక్కువ.
  • పాల్గుణ మాసంలో బహుళ అష్టమి చాల విశేషమైనది.
  • మార్గశిర మాసంలో కాలభైరవ జయంతిని జరుపుకుంటారు.
  • కాలాష్టమి రోజున కాలభైరవుడిని పూజించడం వల్ల అన్ని సమస్యల నుండి పరిస్కారం లభిస్తుంది.

ఏమి చేయాలి

  • ఈ రోజున భక్తులు సూర్యోదయానికి ముందుగానే లేచి, స్నానమాచరించి కాలభైరవునికి ప్రత్యేక పూజలు జరపాలి. 
  • కాలభైరవ కథ లేదా కాలభైరవ అష్టకం చదువుతారు.
  • ఈ రోజు  కాళభైరవుడికి నేతితో దీపం వెలిగించాలి
  • సాయం సంధ్యవేళలో కాలభైరవ ఆలయం లేదా శివాలయం దర్శించవచ్చు.
  • కొందరు భక్తులు ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేస్తారు.
  • కుక్కలకు పాలు, ఆహారం పెట్టవచ్చు.
  • ఈ రోజు కాశీలో ఆహారం దానం చేస్తే విశేష ఫలితం ఉంటుంది.
2022 : నవంబర్ 16.

Post a Comment

0 Comments