సూర్యాస్తమయం తర్వాత చేయకూడని కొన్ని పనులు 


సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళు కొన్ని పద్ధతులను, నియమాలను పద్ధతిగా ఆచరిస్తుంటారు. వాటిని పాటించాలని తర్వాతి తరానికి చెబుతుంటారు.


సూర్యుడు అస్తమించిన తర్వాత లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టే సమయంగా భావిస్తారు. ఆ సమయంలో చీపురుతో ఇల్లు శుభ్రం చేస్తే ఆ ఇంట్లో సంతోషం పాటూ లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్లిపోతుందని భావిస్తారు. అందుకే లైట్లు వేశాం కదా ఇల్లు ఊడ్చొద్దు అని చెబుతారు. అయితే సూర్యస్తమయానికి ముందు ఇల్లు శుభ్రం చేయడం చాలా మంచిది..ఇలా చేస్తే ఈ ఇంట్లో శుభం జరుగుతుంది.


నిత్యం తులసిని పూజించే ఇళ్లలో లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని...సాయంత్రం పూట తులసిని తాకడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని నమ్మకం. అందుకే సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను తాకడం నిషిద్ధం.


సంధ్యాసమయంలో నిద్రపోవడం వల్ల దేవతల ఆశీర్వచనాలు ఉండకపోగా రాక్షస బుద్ధి పెరుగుతుంది. ఈ సమయంలో నిద్ర ఆరోగ్యపరంగా కూడా చెడు ప్రభావం చూపిస్తుంది.


సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో దుష్ట శక్తుల ప్రభావం పెరుగుతుంది..అలాంటి సమయంలో ఇల్లంతా వెలుగుతో నిండి ఉంటే నెగిటివ్ ఎనర్జీ దరిచేరదు. అందుకే సంధ్యాసమయంలో ఇంటిని అస్సలు చీకటిగా ఉంచకూడదు. కుదిరితే దేవుడి దగ్గర, ఇంటి ద్వారం దగ్గర ఈ సమయంలో దీపం వెలిగించడం శుభఫలితాలనిస్తుంది. 


సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో ఉన్న చెత్తను బయట వేయరాదు. ఇలా చేస్తే ఇంట్లో ప్రతికూలత వస్తుందని, లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్లిపోతుందని నమ్ముతారు


చీకటి పడే సమయంలో జుట్టు, గోళ్లను ఎప్పుడూ కత్తిరించవద్దు. ఇది జీవితంపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నమ్మకం. దీనివల్ల  డబ్బు లేకపోవడంతో పాటు అనేక ఇతర సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.


సంధ్యాసమయంలో భార్యభర్త కలవకూడదు. సంధ్యా సమయం అంటే ధ్యాన సమయం...దైవ పూజ చేయకపోయినా పర్వాలేదు కానీ లైంగిక వాంఛలు తీర్చుకోరాదని చెబుతారు. ఇలాంటి సమయంలో శారీరక సుఖాన్ని అనుభవించేవారికి పుట్టేపిల్లలు రాక్షస బుద్ధి కలిగిఉంటారు