• ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమిగా చెప్పబడుతోంది. దీనికే అపరాజిత దశమి, దసరా అని కూడా పేర్లు.
  • అపరాజిత అంటే పరాజయం లేనిది అని అర్థం. 
  • ఈ రోజున ఏ పనిని ప్రారంభించినా అందులో తప్పక విజయం లభిస్తుంది.అందుకే యిది విజయదశమిగా ప్రసిద్ధి చెందింది. 
  • దేవీనవరాత్రులలో కలశాన్ని స్థాపించి, దీక్షతో వున్నవారు ఈ దశమిరోజున ఉద్వాసన చెప్పాలి.
  • ఇక 'దశాహరాత్రం' అనే సంస్కృత పదాలకి ఏర్పడ్డ “దశహరం" అనే వికృతి రూపంనుండి వచ్చిన పేరే దసరా.
  • ఈ రోజున అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.
  • ఈ రోజు సాయంత్రం జమ్మిచెట్టును దర్శించి పూజించాలి. సాధారణంగా గ్రామాలలో సామూహికంగా ఈ శమీపూజ చేస్తుంటారు.
  • ఈ శమీపూజ చేయడం వల్ల అనుకున్న పనులలో 'విజయం' తప్పక లభిస్తుందంటారు.
  • విజయదశమి రోజున ప్రత్యేకంగా విజయకాలాన్ని కూడా పురాణాలు పేర్కొంటున్నాయి.
  • శ్రవణానక్షత్రం, దశమి తిధి వున్న విజయదశమి రోజున సంధ్యాకాలం దాటిన తర్వాత వుండే సమయాల్ని పురాణాలు విజయకాలమని పేర్కొంటున్నాయి.
  • ఒకవేళ శ్రవణం నక్షత్రం లేకపోయినా దశమి తిథిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని దాన్ని విజయముహూర్తంగా భావించాలని స్కాందపురాణం చెబుతోంది.
  • ఈ సమయంలో అంటే దశమి నాటి సంధ్యాకాలం దాటిన మరుక్షణం నుంచి ఒక ఘడియ (24 నిమిషాలు) వరకు పరాశక్తి అపరాజితగా (ఓటమి లేనిదిగా) వుంటుందట.
  • కాబట్టి ఈ సమయంలో ఏ పనిని ప్రారంభించినా విజయాన్ని పొందవచ్చు విజయదశమి నాడు ప్రారంభించే ఏ కార్యమైనా విజయాన్ని చేకూరుస్తుందనేది వాస్తవమైన, ఈ విజయ ముహూర్తంలో పని ప్రారంభించడం మరి మంచిది.
2021 : అక్టోబర్ 15.