తిరుమల తరహాలో ద్వారకా తిరుమల క్షేత్రంలో కూడా పొగతాగటంపై నిషేధం విధించాలని అధికారులు నిర్ణయించారు. ద్వారకాతిరుమలను స్మోక్ ఫ్రీ జోన్‌గా మార్చాలని ఆదేశాలు జారీచేశారు. దేవస్థానం కొండపైనా, కొండ కింద 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల వినియోగంపై అధికారులు నిషేధం విధించాలని నిర్ణయించారు.పొగాకు ఉత్పత్తుల వినియోగం, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. బహిరంగ ప్రదేశాలలో ధూమపాన నిషేధ చట్టంపై విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా ధూమపాన నిషేధంపై భక్తుల్లో అవగాహన కల్పించడం కోసం సిబ్బందికి ముందుగా శిక్షణ ఇవ్వనున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధించడంతో పాటు, వారిపై కేసులు నమోదు చేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.