• ఈ సమస్త భూమికంటే బరువైనది తల్లి. 
  • ఆకాశముకన్నా ఉన్నతుడు తండ్రి. 
  • ఒక్కసారి తల్లికీ, తండ్రికీ నమస్కరించినచో గోవును దానం చేసిన ఫలము దక్కును. 
  • సత్యం తల్లి...జ్ఞానము తండ్రి. 
  • పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. 
  • వందమంది ఆచార్యులకంటే తండ్రి గొప్పవాడు. 
  • ఆ తండ్రికంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి. 
  • వారికి సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి. 
  • ఏ పుత్రుడూ, ఏ పుత్రికా మాతృదేవతను సుఖంగా ఉంచరో, సేవించరో వారి శరీరమాంసాలు శునక మాంసము కన్నా హీనమని వేదం చెబుతుంది. 
  • ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంది, కన్నతల్లి కంటనీరు తెప్పించితే దానికి లక్ష గోవులు దానమిచ్చినా, వేయికి పైగా అశ్వమేధయాగాలు చేసినా పోదు. 
  • తను చెడి బిడ్డలని చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. 
  • చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పేనని ధర్మశాస్త్రము చెప్తోంది.
  •  తల్లిని మించిన దైవం లేదు, గాయత్రికి మించిన మంత్రం లేదు.