• ఆదివారం రోజు సప్తమి తిధి వస్తే దానిని భాను సప్తమి అంటారు.
  • ఈ భానుసప్తమి అనేది సూర్యునికి సంబంధించిన ఒక పర్వదినం.
  • ఈ రోజు మొదట సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం, రెండవది శిరః స్నానం చేయడం.
  • మూడవది ఒంటికి, తలకు నూనె పెట్టరాదు, నాలుగవది ఉల్లి, వెల్లుల్లి, మద్యము, మాంసాహారానికి దూరంగా ఉండాలి.
  • ఐదవది బ్రహ్మచర్యం పాటించాలి.
  • ఈ రోజు చేసే స్నానం, దానం, జపం, హోమం లక్ష రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్ర వచనం.
  • ఈ రోజున ఆవు పాలతో చేసిన పరమాన్నం శ్రీ సూర్యభగవానుడికి నివేదన చేస్తారు.
  • ఈ రోజు సూర్యుని అనుగ్రహం కోసం సూర్య అష్టకం, ఆదిత్య హృదయం, సూర్య ద్వాదశ నామాలు  పాటించడం శ్రేష్టం.
  • సూర్యనమస్కారాలు చేయడం వలన ఎన్నో శుభఫలితాలతో పాటు ఇస్తా కామ్యసిద్ధి కూడా కలుగుతుంది.
  • ప్రతి రోజు ఎవరు అయితే సూర్యోదయ సమయంలో సూర్యనమస్కారాలు చేస్తారో వారికీ అన్నింటా విజయం కలుగుతుంది. 

2022 : జనవరి 9.