మాసిక లేదా మాస దుర్గాష్టమి రోజున దుర్గాదేవిని పూజిస్తారు. ప్రతి నెల శుక్లపక్ష అష్టమి రోజున మాస దుర్గాష్టమిని ఆచరిస్తారు.
ఆశ్వయుజ మాసంలో వచ్చే శుక్ల పక్ష అష్టమి రోజున మహా అష్టమి లేదా దుర్గాష్టమిని జరుపుకుంటారు.
దుర్గ అష్టమి రోజున మహిసాసుర అనే రాక్షసుని దుర్గాదేవి సంహరించింది.
మాస దుర్గాష్టమిని ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ భారతంలో జరుపుకుంటారు.
ఈ రోజు తెల్లవారుజామునే స్నానం చేసి దుర్గాదేవిని పూజిస్తారు.
కొన్ని ప్రాంతాలలో కుమారి పూజ కూడా చేస్తారు.
అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు.
ఉపవాసం ఉంటారు. ఉండలేని వారు పాలు, పండ్లు సాత్విక ఆహారం తీసుకుంటారు.
మాంసాహారం, మద్యపానం వంటి వాటికీ దూరంగా ఉంటారు.
కటిక నేల మీద నిద్రిస్తారు.
దేవి భాగవతం, దుర్గ చాలీసా, దుర్గ అష్టమి వ్రత కథ వంటి గ్రంధాలను పారాయణ చేస్తారు.
అమ్మవారి ఆలయాలను దర్శిస్తారు.
భక్తితో ఈ వ్రతం ఆచరించిన వారిని అమ్మవారు సుఖ శాంతులు ప్రసాదిస్తుంది అన్ని నమ్ముతారు.
2022 : జనవరి 10.
0 Comments