హిందూ ఆచారం ప్రకారం షష్ఠి తిధి సుబ్రమణ్యస్వామి ఆరాధనకు అనుకూలమైన రోజు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో ప్రతి నెల ఈ రోజు సుబ్రమణ్య స్వామిని ఆరాధిస్తారు.
నెలలో మనకు రెండు సార్లు షష్ఠి తిధి వస్తుంది ఒక్కటి శుక్ల పక్షంలో , మరొకటి కృష్ణ పక్షంలో . కృష్ణ పక్షములో వచ్చే షష్ఠి తిధి సుబ్రమణ్యస్వామి ఆరాధనకు ముఖ్యమైనది.
సుబ్రమణ్యస్వామిని కార్తికేయ, స్కంద, కుమారస్వామి, మురుగన్ అనే నామాలతో కూడా పిలుస్తారు. శివపార్వతుల కుమారుడైన ఈయన దేవతలకు సర్వసైనాధ్యక్షుడు. ముఖ్యంగా తమిళనాట స్కంద షష్ఠిని ఆచరిస్తారు. సుబ్రమణ్య స్వామి ఆరు ముఖ్యమైన ఆలయాలు కూడా ఈ తమిళనాడు రాష్టంలో వెలిసాయి.
షష్ఠి రోజు స్వామివారు సూరపద్మన్ అనే రాక్షసుని సంహరించినట్లు పురాణ కధనం.
ఏమి చేయాలి
- ఉదయాన్నే స్నానం చేసి సుబ్రమణ్య స్వామిని పూజిస్తారు.
- వీలైతే ఉపవాసం ఉంటారు. ఉండలేని వారు పాలు, పండ్లు సాత్విక ఆహారం భుజిస్తారు.
- సుబర్మాణ్యస్వామి ఆలయాన్ని దర్శిస్తారు.
- స్కాందపురాణం, స్కంద షష్ఠి కవచం పారాయణ చేస్తారు.
- మద్యపానం, మరియు ఇతర చేదు అలవాట్లకు దూరంగా ఉండాలి.
ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి స్వామివారు అన్ని విధాలా కరుణిస్తాడు అని భక్తులు విశ్వసిస్తారు.
2022 : జనవరి 7
0 Comments