శ్రీ రమాసహితా సత్యనారాయణ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ సేవ వివరాలు :
13న బుధవారం రోజున ఉదయం నిత్యనిధి, దీక్ష కంకణధారణ, ప్రాభోదికి ఆరగింపు, విశ్వక్సేనారాధన, నిరంతరం సప్తాహ భజనలు ప్రారంభం.
16న నిత్యనిధి, తీర్థప్రసాదగోష్ఠి, గోధూళిక సుమూహర్తమున శ్రీస్వామి వారి కల్యాణము నిర్వహిస్తారు.
17న నిత్యనిధి, ప్రాభోదిక ఆరగింపు, ఉదయం 8 గంటలకు స్థాళీపాక, పంచసూక్త హోమములు, బలిహరణము.
18న నవగ్రహ హోమము, తీర్థప్రసాద గోష్ఠి, పంచసూక్త హోమములు.
19న మంగళవారం రోజున పౌర్ణమి జాతర.
20న తెల్లవారుజామున శ్రీస్వామివారి రథోత్సవం, ఉదయం 10 గంటలకు సప్తాహ భజన కార్యక్రములు పరిసమాప్తము, సాయంత్రం స్వామివారి ఏకాంత సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ ఆలయం తెలంగాణ "అన్నవరం" గా ప్రసిద్ధి చెందింది.
ఎలా వేలాలి :
మంచిర్యాల నుండి 33 కి.మీ దూరంలో, హైదరాబాద్ నుంచి 226 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం
0 Comments