మురుడేశ్వర్ ఆలయం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని భత్కల్ తాలూకాలో మురుడేశ్వర్ తీర పట్టణంలో ఉంది ఈ ఆలయం. ప్రపంచపు రెండవ పెద్ద శివ విగ్రహం ఉన్న ఆలయం ఇది.ఈ ఆలయం చుట్టు మూడు వైపులా అరబియా సముద్రం ఉంది. ఆలయ ప్రాంగణం 20 అంతస్తుల భారీ గోపురంతో మొదలవుతుంది.
మురుడేశ్వర్ ఆలయం కందుక పర్వతం అనే చిన్న కొండా పైన ఉంది. 20 అంతస్తుల రాజా గోపురం సుమారు 237.5 అడుగుల పొడవు ఉంటుంది. గోపురంలో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది.
శివుని విగ్రహం క్రింద ఒక గుహ ఉంది. ఇక్కడ శ్రీ కృష్ణ భగవానుడు అర్జనుడికి గీత ఉపదేశం చేసినట్లు చెబుతారు.
- కర్ణాటకలోని పంచ శివ క్షేత్రాలలో ఈ ఆలయం ఒక్కటి. మిగతా నాలుగు నంజంగఢ్, ధర్మస్థల, ధారేశ్వర, గోకర్ణ.
- శివుని మీద సూర్య కిరణాలూ పడడంతో, ఈ విగ్రహం ప్రతిభింబిబిస్తుంది.
- ఈ ఆలయం గోపురం శ్రీరంగం లోని ఆలయం గోపురం తరువాత రెండవ పెద్ద గోపురం.
- భక్తులే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు.
- ఆలయం కట్టినపుడు నుంచి దీపం వెలుగుతూ ఉంది, భక్తులు కూడా దీపం లో నూనె పోయవచు.
ఆలయ వేళలు
ఉదయం దర్శనం - 06.00 - 01.00
ఉదయం పూజలు - 06.30 - 07.30
సాయంత్రం దర్శనం - 03.00 -08.30
మహా పూజ - 12.15 - 01.00
రాత్రి పూజ - 07.15 - 08.15
సాంప్రదాయ దుస్తులలో దర్శనం చేసుకోవాలి .
పండుగలు
మహాశివరాత్రి
కార్తీక పౌర్ణమి
ఎలా వేలాలి :
మంగళూరు నుంచి 165 కి.మీ దూరంలో, బెంగళూరు నుండి 455 కి .మీ దూరంలో ఉంది ఈ ఆలయం.
వసతి సౌకర్యం :
హోటలు అందుబాటులో ఉన్నాయి.
చుట్టూ ప్రక్కన దర్శించవలసిన ఆలయాలు
54 కి.మీ దూరంలో గోకర్ణ మహాబలేశ్వర్ ఆలయం
20 కి.మీ దూరంలో ఇదగుంజి మహా గణపతి ఆలయం
60 కి.మీ దూరంలో కొల్లూర్ మూకాంబిక ఆలయం
0 Comments