షాట్ తిల ఏకాదశి ని తిలదా ఏకాదశి అని కూడ పిలుస్తారు.ఇది సాధారణంగా జనవరి మాసం లో వస్తుంది. ఉత్తర భారతం లో మాత్రం ఈ ఏకాదశి మాఘ మాసం లో, దక్షిణ భారతం లో మాత్రం ఈ ఏకాదశి పుష్య మాసం లో జరుపుకుంటారు . ఏకాదశి రోజు విష్ణుని ఆరాధిస్తారు.
ఈ ఏకాదశి గురంచి ‘భవిష్యోత్తర పురాణంలో పులస్త్యముని ,దాల్భ్యు మధ్య సంభాషణ లో వస్తుంది. ఈ ఏకాదశి ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే ఆరోగ్యం బాగా ఉంటుంది అని చెప్తారు. హిందూ పురాణాలు ప్రకారం షాట్ తిల ఏకాదశి ఆచరించడం వల్ల మరో జన్మ ఉండదు అని భావిస్తారు. ఈ ఏకాదశి రోజు నువుల గింజలు దానం చేస్తే తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి.
షాట్ తిల ఏకాదశి రోజు ఉదయానే నువ్వుల గింజల తో స్నానం చేయాలి. విష్ణు ఆలయాన్ని కి వెళ్లి విష్ణు ని ఆరాధించాలి. విష్ణు కి అభిషేకం చేయాలి. మనసులో ఎటువంటి ఆలోచనలు (కామ ,క్రోధ ,దురాశ, కోపం) లేకుండా విష్ణు ఆరాధనలో కాలం గడపాలి. పూర్తిగా ఉపవాసం వున్నా వాళ్లు ఏమి తినడం కానీ తాగడం కానీ చేయరు. కొంత మంది మాత్రం వాళ్ల ఆరోగ్య రీత్యా పండ్లు , మంచి నీరు, తీసుకుంటారు.కొంత మంది భక్తులు రాత్రి జాగరణ కూడ చేస్తారు. పక్క రోజు ఉపవాసం విడుస్తారు.
2021 : ఫిబ్రవరి 07.
0 Comments