• పాల్గుణ బహుళ అమావాస్యని కొత్త అమావాస్యగా పిలుస్తారు. కొత్త సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్య కనుక దీనిని కొత్త అమావాస్య అంటారు.
  • ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తెల్లవారి వచ్చే ఉగాదితో నూతన తెలుగు సంవత్సరం ఆరంభమవుతుంది.
  • కొన్ని క్రతువులు, ప్రక్రియలకు ఈ అమావాస్య రోజు మంచిది. సాధకులు ఈ రాత్రిని తాంత్రిక సాధనానికి ఉపయోగించుకుంటారు.
  • ఈ రోజు దేవ, పితృ ఆరాధనలు చేయడం శ్రేష్టం.
  • ఈ రోజు అన్నదానం చేయడం పుణ్యప్రదంగా చెబుతున్నాయి పురాణాలు.
  • ఈ రోజున ఒక పూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలి అని శాస్త్రం చెబుతోంది.
  • ఈ శుభదినాన ఏరువాక ప్రారంభించే రైతులకు, అన్నదాతలకు సిరుల పంట పండుతుంది అని విశ్వాసం.
  • ఈనాటి విధులలో గ్రామదేవతలకు ఉత్సవాలు ప్రధానమైనవి.పంచభూతాలను ఆరాదించడంలో ప్రత్యేకమైన పద్దతిగా గ్రామదేవతల పూజాపద్దతి ప్రారంభమైనది.భారతీయుల జీవన విధానంలో గ్రామదేవతలు ఒక భాగం.ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం.
  • ఈ రోజుకు మత్స్యంతో అనుబంధం వున్నా కారణాన,చెరువులు, సరస్సులు, నదులు మరియు ఇతర నీటి వనరులు శుద్ధి చేయాలి.
  • ఈ రోజు నుండి మత్య్స జయంతి పర్వదినం సమీపంలో ఉంటుంది. కాబట్టి మత్య్సవతార వర్ణనలు చదవడం, మత్స్య పురాణం పారాయణాలు ప్రారంభించి జయంతి నాటికీ ముగించాలి. తద్వారా పాపచింతన తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది.
2021 : ఏప్రిల్ 11/12.