శ్రీ అగస్తేశ్వర స్వామి వారి ఆలయం చిత్తూరు జిల్లాలోని తిరుపతి దగ్గరలో సువర్ణముఖి నదీతీరాన వెలసింది.
ఇక్కడ శివుడిని అగస్త్య మహాముని ప్రతిష్టించడం వల్ల స్వామివారికి అగస్తేశ్వర స్వామి అని పేరు. ఇక్కడ అమ్మవారు ఆనందవల్లి.
ఈ ఆశ్రమానికి కొద్దీ దూరంలోనే భీమానది, కళ్యాణి నది, సువర్ణముఖి నది సంగమం ఉంది. ఒకరోజు అగస్త్యముని నది స్నానం చేస్తుండగా ఆయనకొక సహజ లింగం దొరికింది, దానిని నదీతీరాన ప్రతిష్టించి ఆలయ నిర్మాణం చేసారు.
కాలక్రమంలో ఈ ఆలయం కొట్టుకుపోయింది మళ్లీ చోళరాజుల ఈ ఆలయం నిర్మించి అమ్మవారిని ప్రతిష్టించారు.
వివాహం అయిన తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు అగస్త్య మహాముని అనతి మేరకు ఇక్కడ కొంత కాలం నివసించారు అని చెప్తారు.
ఆలయ వేళలు
ఉదయం 7.00 నుండి రాత్రి 7.30 వరకు
తిరుపతి నుండి 12 కిమీ దూరంలో ఉంది ఈ ఆలయం.
0 Comments