• ఉగాదిని చైత్ర మాస శుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు. ఇది తెలుగువారి తోలి పండుగ.
  • ఈ రోజు నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది. 
  • ఈరోజునే బ్రహ్మ సమస్త సృష్టినీ ప్రారంభించాడని చెబుతారు.
  • శ్రీ మహావిష్ణువు  మత్స్యావతారాన్ని ధరించి, సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఉగాది రోజునే.
  • ప్రకృతి పరంగా చూస్తే కొత్త మార్పులు కూడా ఉగాది రోజు నుంచే ప్రారంభం అవుతాయి.
  • పూల పరిమళాలతో గుబాళించే వసంతరుతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది.
  • ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉగాది పండుగను పిలుస్తారు జరుపుకుంటారు.
  • ఒక్క తెలుగు సంప్రదాయంలోనే కాకుండా మరాఠీలు గుడి పడ్వా, మలయాళీలు విషు, సిక్కులు వైశాఖీ, బెంగాలీలు పాయ్‌లా బైశాఖ్ అనే పేర్లతో ఉగాదిని జరుపుకోవడం విశేషం.
  • ఉగాది పచ్చడి రుచి మారొచ్చు కానీ ఎక్కడైనా ప్రకృతిలోని మార్పులు ఎంత సహజమో జీవితంలో కష్టసుఖాలూ అంతే సహజమని ప్రకృతి సాక్షిగా చాటిచెప్పడమే ఉగాది పండగ ముఖ్యఉద్దేశం.
ఈ రోజు ఏమి చేయాలి ?
  • ఉగాది రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి.స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి.
  • ఇష్ట దైవాన్ని పూజించాలి.
  • తరువాత ఉగాది పచ్చడిని ప్రసాదంగా తినాలి.
  • ఉదయం లేదా సాయంత్రం వీలును చూసుకుని గుడికి వెళ్లాలి.
  • పంచాంగ శ్రవణం వినాలి. 

2021 : ఏప్రిల్ 02.