శ్రీజయేంద్ర సరస్వతీ మహాస్వామి బోధనలు సామాన్యులకు సైతం చక్కగా అర్థమవుతాయి. మనిషిగా పుట్టిన ప్రతివారూ నలుగురు మాతృమూర్తులను పూజించాలని ఆయన తరచుగా చెబుతుండేవారు. జన్మనిచ్చిన తల్లి, గోమాత జన్మించిన దేశం, సృష్టిని పాలించే జగదంబ ఈ నలుగురినీ తప్పనిసరిగా పూజించాలనే వారు. ఆయన బోధనలు పది ఆజ్ఞలు ప్రధానమైనవి. వీటిని ఒక కాగితంపై రాసి అందరికీ కనిపించే విధంగా ఇంటిలో అతికించుకోమనేవారు శ్రీజయేంద్ర స్వామి.
ప్రతి ఉదయం నిద్రలేవగానే భగవంతుణ్ణి స్మరించాలి. కనీసం రెండు నిమిషాలపాటు దైవాన్ని స్మరించుకున్న తరువాతనే దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకోవాలి.
తప్పనిసరిగా ప్రతివారూ తిలకధారణ చేయాలి
ప్రతిరోజూ మంచి జరగాలని భగవంతుణ్ణి కోరుకోవాలి
పుణ్యనదులను, గోమాత, సప్తచిరంజీవులను ఇత్యాదులను తలచుకునే ప్రార్ధన శ్లోకాలను నిత్యం చదువుకోవాలి.
కనీసం శుక్రవారం రోజునైనా సమీపంలోని ఆలయానికి వెళ్లాలి.
నీ పొరుగువారిని ప్రేమించాలి
మీరు తినేముందు జంతువులకు లేదా పక్షులకు కొంత ఆహారం తినిపించాలి.
ప్రతిరోజు చిన్న మొత్తమైనా సరే.. బీదసాదలకు పంచిపెట్టాలి.
నిద్రపోయే ముందు ఈ రోజు జరిగిన మంచి, చెడులను గురించి విశ్లేషించుకోవాలి
భగవంతుని నామాలను కనీసం 108సార్లు జపించాలి.
0 Comments