• ప్రాణం అంటే ఊపిరి,యామం అంటే నియంత్రణ, ప్రాణాయామం ద్వారా ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని, ఏకాగ్రతని పొందవచ్చు.
  • ప్రాణాయామం సర్వరోగ నివారణకు సులభ మార్గం.
  • ప్రాణవాయువు హృదయంలో అనాహత చక్రం దగ్గర ఉంటుంది.లలిత సహస్రనామంలో అనాహతాబజానిలయ అనే నామం వుంది.
  • జీవుల అందరి హృదయాలలో అనాహతా చక్రం దగ్గర ఒక తామరపువ్వు రూపంలో అమ్మవారు ఉంటుంది అని చెబుతారు.
  • ఈ చక్రం నిశ్శబ్దంగా నెమ్మదిగా శరీరం నుండి అతి సూక్ష్మ ప్రయాణం చేస్తూ ఉంటుంది.
  • ప్రాణవాయువు మిగిలిన నాలుగు వాయువులతో కలసి పంచప్రాణాలు అయ్యాయి.
  • హృదయగతమైంది ప్రాణం అయితే, గుదస్థానంలో అపానం ఉంటుంది, నాభిస్థానంలో సమానవాయువు, కంఠదేశంలో ఉదాన వాయువు, సర్వశరీరంలో వ్యానవాయువు ఉంటాయి. 
  • అపానవాయువు ముఖ్యవిధి విసర్జితాలను బయటకి పంపడం. ఈ వాయవు వల్ల ప్రాణులు అందరు సుఖంగా ఉంటారు. షట్చక్రాలలో మూలాధారంలో  సంచారం చేస్తూ ఉంటుంది. ఇది శివశక్తుల కలయికలో ఉండే స్థానం. మూలాధారైక నిలయ అంటుంది లలిత సహస్రం. 
  • ఇక్కడ కూడా అమ్మవారు మూలాధారచక్రంలో నిలబడి, మనిషి జీవితాన్ని సఫలీకృతం చేస్తూ సక్రమమైన మార్గంలో నడిపిస్తూ ఉంటుందట.
  • అపానవాయువు నిజాయితీగా మనిషి శరీరంలోని అంశాలన్నింటినీ బయటికి పంపించేస్తూ శరీరమంతా కడిగి శుభ్రం చేస్తూ సంపూర్ణ ప్రక్షాళన చేస్తుంది.
  • శరీరంలో అంతటా సమానంగా రక్త ప్రసారం చేసేది సమాన వాయువు ఇది మనిషి శరీరంలో నాభి దగ్గర సంచరిస్తూ ఉంటుంది.
  • షట్చక్రాలలో మూడవదైన మణిపూరం దీని స్థానం. మణిపురబీజనిలయా అంటోంది లలిత సహస్రం. అమ్మవారు నాభి స్థానంలో నిలిచి అజ్ఞానాన్ని, అనారోగ్యాలను అనాయాసంగా తొలగిస్తూ ఉంటుంది.
  • ఎప్పటికప్పుడు శరీర ఉష్ణోగ్రతలను పద్దతిగా పోషిస్తూ హెచ్చుతగ్గులు లేకుండా చూసేది సమాన వాయువు. ఈ వాయువు వేడిమిని సమపాళ్ళలో నింపుతూ ఎల్లవేళలా మనిషి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
  • సమాన వాయువు కూడా ప్రాణవాయువుని, అపానవాయువు సమంగా తనలో కలుపుకుంటూ పోతుంది.రెండింటి శక్తినీ తనలోకి మార్చుకొని ఆ జఠరాగ్నిగా రూపొందుతుంది. అందుకే ఆకలి, అరుగుదల ముఖ్యంగా భావిస్తాం మనం.
  • ఆకలి, అరుగుదల మొదలైనవి నుంచి మనిషికి అనారోగ్యం ఏర్పడుతుంటే ఆ మనిషి జీవించే మార్గాన్ని వదిలేసి, పక్కదారి పడుతున్నాడని సమాన వాయువు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది.
  • శరీరంలో ఊర్ధ్వ భాగంలో ఉండే కంఠంలో శ్రావ్యతనీ, చక్కని శబ్టోచ్ఛారణ నీ, స్పష్టమైన వాక్కుని ఇచ్చేది ఉదాన వాయువు.
  • ప్రాణవాయువు ఉదాన వాయువు ద్వారా మిగతా వాయువులని ఉత్తేజ పరుస్తుంది. ఉదాన వాయువు సరిగా ప్రసారం అవుతుంటే నిద్ర పట్టక పోయే సమస్య ఉండదు. షట్చక్రాలు దీని స్థానం విశుద్ధి చక్రం. లలితా సహస్రనామంలో విశుద్ధిచక్రనిలయాయై నమః అనే నామం ఉంది. 
  • కంఠస్థానంలో కూడా అమ్మవారు నిలిచి, మనిషికి స్పష్టమైన ఉచ్చారణనీ గంభీరమైన వాక్కుని, విశుద్ధ మాధుర్యాన్ని ఇస్తుంది.
  • వ్యాన అనే వాయువు చేత చాలా విశేషంగా బతుకుతారని అమరకోశం వ్యాఖ్యానిస్తోంది. ఎందుకంటే ఇది శరీరం అంతటా ప్రవహించి ఉంటుంది. 
  • మన శరీరంలో అత్యధిక శాతం నీరు ఉంటుంది కనుక ఆ నీటితో వాయువు సమానంగా వ్యాపిస్తూ ప్రవహిస్తూ, ప్రకాశిస్తూ ఉంటుంది. 
  • స్వాధిష్ఠానాంబు జగతా చతుర్వక్త మనోహరా అన్న నామం లలితా సహస్రంలోనిది. వాయువుల్లో ఇది అయిదోది. చాలా ముఖ్యమైనది. ఈ వాయువు ద్వారానే శరీరానికి చెమట పడుతుంది. శరీరంలోని 72 వేల నాడులను శక్తివంతంగా సమర్థవంతంగా నడిపిస్తుంది.
  • ఈ వాయువు ప్రసారం సమంగాజరుగుతున్నట్లయితే శారీరక మానసిక భక్తులు అద్వితీయంగా పనిచేస్తాయి. ఈ వాయువు ప్రసారం సరిగా లేకపోతే శరీరం మీద పటుత్వం కోల్పోతారు. ఆందోళన అయోమయం చుట్టుముడతాయి.శరీరకాంతికి, తేజస్సుకు ఈ వాయువే కారణం.
ఈ  అయిదు ప్రాణాలు కాకుండా మనలో మరో అయిదు ఉపప్రాణాలు కూడా ఉన్నాయి.

  • నాగ వాయువు త్రేన్పు బయటకు వస్తుంది. 
  • కూర్మ వాయువు కంటిరెప్పల్లో ఉంటుంది. దీనివల్లనే మనం రెప్పవేయగలుగుతాం. 
  • కృకల అనే వాయువు తుమ్ముకు కారణమవుతుంది. 
  • ధనంజయ వాయువు హృదయ నాడులను మూస్తూ తెరుస్తూ ఉంటుంది
  • దేవదత్తం అనే వాయువు ఆవులింతకు కారణమవుతుంది.
మొదటి అయిదింటిలో ప్రాణవాయువు శ్వాస ద్వారా హృదయానికి  ఆ తర్వాత అన్ని కణాలకు చేరుతుంది. అపాన వాయువు ఊపిరితిత్తులు, విసర్జన అవయవాల ద్వారా వ్యర్ధ పదాలు బయటకు పంపుతుంది.

వ్యాస వాయువు శరీరం సంకోచ వ్యాకోచాలకు కారణమవుతుంది. ఉదాన వాయువు కంఠస్థానంలో వాక్కు రూపంలో ఉండే ఉంటుంది. సమాన వాయువు మనం తిన్న పదార్థాలను జీర్ణం చేస్తుంది

మూలాధార చక్రానికి భూమి, స్వాధిష్టాన చక్రానికి జలం, మణిపూరానికి అగ్ని అనాహత చక్రానికి వాయువు, విశుద్ధ చక్రానికి ఆకాశం మూలాధారాలు

పంచభూతాలు పంచ వాయువులు కలిసి ఐదు మహత్తర చక్రాల సమ్మేళనంతో మనిషి జీవితాన్ని నడిపిస్తాయి. 

మనలోని మనతోనే ఉండే ఈ వాయువుల సంచారాన్ని అవగతం చేసుకోవడానికి మనిషి తన దేహాన్ని తానే శోధించు ఇదే దీర్ఘాయువును పొందే సూత్రం.