• శబరిమల ఆలయంలో ప్రవేశించేందుకు ఉన్న పద్దెనిమిది మెట్లుకు పదునెట్టాంబడి అని పేరు.
  • మాల వేసి, ఇరుముడి దీక్ష తీసుకున్న భక్తులు మాత్రమే ఈ పదునెట్టాంబడి ద్వారా స్వామిని దర్శించుకుంటారు.
  • అయ్యప్ప స్వామి అవతారం చాలించి ఆలయంలో ప్రవేశించేందుకు వీలుగా నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య,అవిద్య , జ్ఞానం, అజ్ఞానం దేవత రూపాలు ధరించి మార్గంలా ఏర్పడ్డాయి.
  • ఈ పదెనిమిది మెట్లను పరశురాముడు స్వయంగా నిర్మించినట్లు చెబుతారు. 
  • ఈ మెట్లు చాల పవిత్రమైనవి.
  • కామం, క్రోధం, లోభం, మోహం, మదం మాత్సర్యం, దర్పం, అధికారం అనే అనుష్ఠారాగాలు - కన్ను, చెవి, ముక్కు నోరు. చర్మం అనే పంచేంద్రియాలు - సత్వ, రజో, తమో అనే మూడు గుణాలు విద్య, విద్య అనే రెండు సంస్కారాలకు ఈ పద్దెనిమిది మెట్లు నిదర్శనం.
  • ఈ పదునెట్టాంబడికి ద్వారపాలకులు కదుత్తస్వామి, కరుప్పు స్వామి.
  • ఈ మెట్లకు చేసి పూజను పడిపూజ అని అంటారు.
  • అణిమ, లఘిమ, మహిమ, ఈశత్వ, వశత్వ, ప్రాకామ్యా, బుద్ధి, ఇచ్చ, ప్రాప్తి, సర్వకామ, సర్వ సంపత్కర, సర్వప్రియకర, సర్వ మంగళకర, సర్వదుఃఖ విమోచన, సర్వ మృత్యు ప్రశమన , సర్వ విఘ్న నివారణ, సర్వాంగ సుందర, సర్వ సౌభాగ్యదాయక అనేవి ఈ పద్దెనిమిది మెట్లుకు పేర్లు.