Ad Code

Responsive Advertisement

జ్యేష్ట మాసంలో ముఖ్యమైన తిధులు

జ్యేష్ఠ మాసంలో ముఖ్యమైన రోజులు, ఏ తిధిలో ప్రాముఖ్యత వివరాలు :

జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి : కరవీర వ్రతం ఆచరిస్తే సౌభాగ్యం కలుగుతుంది. గన్నేరు పూలతో అమ్మవారిని పూజించాలి జ్యేష్ఠ శుద్ధ విదియ : ఈ రోజును సోపపడము అంటారు శ్రాద్ధ కర్మలు ఆచరించాలి.

జ్యేష్ఠ శుద్ధ విదియ : ఈ రోజును సోమపదము అంటారు. శ్రాద్ధకర్మలు ఆచరించాలి.

జ్యేష్ఠ శుద్ధ తదియ : ఈ రోజు ప్రతిమ రూపంలో అరటి చెట్టువద్ద పార్వతీదేవిని పూజించి, వస్త్ర దానం చేస్తే సంపద, సౌభాగ్యాలు కలుగుతాయి.

జ్యేష్ఠ శుద్ధ చవితి : పార్వతీ మాత ఉమాదేవిగా అవతారం దాల్చిన రోజిది.ఉమాదేవి ఆరాధన చేస్తే స్త్రీలకు సౌభాగ్యవృద్ధి కలుగుతుందని బ్రహ్మపురాణ వచనం.

జ్యేష్ఠ శుద్ధ షష్ఠి : అరణ్యక గౌరీ వ్రతం, వింధ్యవాసిని ఆరాధన ఆచరించిన స్త్రీలకు సౌభాగ్యం వర్ధిల్లుతుందని స్కాంద పురాణం చెబుతోంది.

జ్యేష్ఠ శుద్ధ అష్టమి : శుక్లాదేవి ఆరాధన సంపత్కరం. అష్టమి రోజు పూజ చేయాలి. మరునాడు నవమి తిథి నాడు ఉపవాసం చేసి తిరిగి శుక్లాదేవి, బ్రహ్మణీ దేవిని పూజించాలి.

జ్యేష్ఠ శుద్ధ దశమి: దీన్ని దశపాపహర దశమి అంటారు.సేతుబంధన రామేశ్వర ప్రతిష్ట జరిగిన రోజు. ఈ రోజున నదీ స్నానం పురాణవచనం దానం చేస్తే దశవిధ పాపాలు నశిస్తాయని పురాణ వచనం. 

జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి : దీన్ని నిర్జల ఏకాదశి అంటారు. ఈ రోజు జలం కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉండి, వీటి కుండ (చెంబు ను) బ్రాహ్మణులకు దానం చేస్తే విష్ణు లోక ప్రాప్తి కలుగుతుంది.

జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి : ఈ రోజు త్రివిక్రమ మూర్తిని పూజించాలి 

జ్యేష్ఠ పౌర్ణమి : ఈ రోజు ఏరువాక పున్నమి అంటారు. తిలపాత్రదానం, వృషభపూజ, వటసావిత్రివ్రతం, చేస్తే సర్వపాపహరం, అశ్వమేధయాగఫలం.  ఛత్రము, పాదరక్షలు దానమిస్తే ఆధిపత్యం కలుగుతుంది. ఇదే రోజు బల్వాత్రిరాత్రి వ్రతం చేస్తే పుణ్యలోకప్రాప్తి.

జ్యేష్ఠ బహుళ అష్టమి : ఈ రోజు ఈశ్వర ఆరాధన వల్ల శివలోకప్రాప్తి.

జ్యేష్ఠ బహుళ ద్వాదశి : ఈ రోజు కుర్మాజయంతి, విష్ణు కూర్మావతారం ధరించింది ఈ రోజే. కుర్మా ఆరాధన సర్వశుభలను కలుగజేస్తుంది. విష్ణులోకప్రాప్తి పొందుతారు.

జ్యేష్ఠ అమావాస్య :  జ్యేష్ఠ బహుళ అమావాస్యనాడు వటసావిత్రివ్రతం చేయాలి. ఈ వ్రతం చేస్తే వైధవ్య దోషం పోతుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి. 

Post a Comment

0 Comments