ఈ ఆలయం తూర్పుగోదావరి జిలాలోని సర్పవరం గ్రామంలో వుంది. ఈ ఆలయంలో శ్రీ భావనారాయణ స్వామివారు శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారితో దర్శనం ఇస్తారు. ఈ ఆలయం చాల పురాతనమైనది, సుమారు 500 ఏళ్ళ క్రితం నిర్మించబడింది.
ఈ ఆలయం శ్రీమహావిష్ణు పంచమహాక్షేత్రాలలో మొదటిది. ఈ ఆలయ రాజగోపురం 80 అడుగుల ఎత్తులో ఉంటుంది.
పురాణాల ప్రకారం మాయ సరోవరంలో స్నానమాడిన నారద మహర్షి స్త్రీగా మారిపోతాడు. స్త్రీగా మారిన నారద మునిని నికుంత మహారాజు పెళ్లిచేసుకొంటాడు, వారికీ అరవై మంది సంతానం కలుగుతారు. ఒక్క యుద్ధంలో అరవై మంది సంతానం మొత్తం చనిపోతారు, ఆ సమయంలో పురోహితుడుగా వచ్చిన శ్రీమహావిష్ణువు నారదమునిని సరోవరంలో స్నానం చేయమంటాడు, దాంతో అయన మళ్లీ పురుషుడుగా మారిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న నారద ముని ఇక్కడ రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠితాడు.
ఆలయ వేళలు :
ఉదయం 6 నుండి మధ్యాహ్నం 11 వరకు
సాయంత్రం 5 నుండి రాత్రి 8 వరకు
ముఖ్యమైన పండుగలు :
కార్తీక మాసం
వైకుంఠ ఏకాదశి
మాఘ మాసం (ఆదివారాలు)
వైశాఖ శుద్ధ ఏకాదశి
ఎలా వెళ్ళాలి :
కాకినాడ నుండి 6 కి.మీ
చుట్టు ప్రక్కల చూడవలసిన ఆలయాలు :
సామర్లకోట శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయం - 12 కి.మీ
పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయం - 16 కి.మీ
ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం - 36 కి.మీ
అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం - 44 కి.మీ
0 Comments