గుళ్లు, ఆలయాలలో సోమవారం నుంచి తెరిచే వీలు కల్పిస్తున్న నేపథ్యంలో పాటించవలసిన నియమాలు :
వీరికి ఆలయ ప్రవేశం ఉండడు
వీరికి ఆలయ ప్రవేశం ఉండడు
- 65 ఏళ్ళ పైన వారికి
- 10 ఏళ్ళ లోపు వారికి
- గర్భిణీ స్త్రీలకు
- దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి
- కనీసం 6 అడుగుల దూరం పాటించాలి
- మాస్కులు ధరించాలి
- క్రమం తప్పకుండ హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్ తో చేతులు శుభ్రపరుచుకోవాలి
- దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు టిష్యూ పేపర్ అడ్డుపెట్టుకొని తరువాత దానిని దూరంగా పడేయాలి.
- ఆరోగ్యసేటు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి.
- వీలైతే చాప తీసుకువెళ్లవచ్చు.
భక్తులు చేయకూడనివి :
- ఎక్కడ ఉమ్ము వేయటం చేయకూడదు
- పుస్తకాలను, విగ్రహాలను తాకకూడదు
- మాస్కులు లేకుండా దర్శనానికి వెళ్ళకూడదు.
- ప్రసాదం తీసుకోకూడదు
- ఒంట్లో నలతగా ఉంటే దర్శనానికి వెళ్ళకండి
- షేక్ హాండ్స్ ఇవ్వకండి.
ఆలయ అధికారులు చేయవలసినవి :
- కచ్చితంగా శానిటైజర్ మరియు థర్మల్ స్క్రీనింగ్ అందుబాటులో ఉండాలి.
- కరోనా లక్షణాలు లేనివారిని దర్శనానికి అనుమతించాలి
- మాస్కు ధరించిన వారికి మాత్రమే దర్శనం కల్పించాలి
- ఆలయ పరిసరాలలో పాదరక్షలు ధరించకుండా చూడాలి.
- భౌతిక దూరం పాటించేలా చూడాలి
- ఆలయ ప్రవేశానికి, దర్శనం తరువాత బయటకి వేరువేరు మార్గాలు ఉండాలి.
- అన్నదానం అప్పుడు భౌతిక దూరం పాటించాలి
- ఆలయ సత్రాలలో (రూములలో ) ఉష్ణోగ్రత 24 - 30 డిగ్రీలు మధ్య ఉండాలి.
- ఆలయ పరిసరాలు దగ్గర శుభ్రత పాటించాలి.
- అభిషేక పవిత్ర జలాలు భక్తుల మీద చల్లకూడదు.
- ప్రసాదాలు ఇవ్వకూడదు
- భక్తులను గుంపుగా కలవకుండా చూడాలి.
0 Comments