అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, కంచి , ఉజ్జయిని, ద్వారకా సప్త మోక్ష క్షేత్రాలు అని పురాణ వచనం. ఈ నగరాలను దర్శించిన, స్మరించిన మంచిదే. 

అయోధ్య - రామజన్మభూమి

  • అయోధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్ జిల్లాలో ఉంది.
  • అయోధ్యను సాకేతపురమని కూడా అంటారు. 
  • విష్ణువు శ్రీరాముడిగా అవతరిం ప్రదేశమిది.
  • సరయూ నది తీరంలో ఉంది.ఇక్ష్వాకు వంశస్తుల రాజధాని నగరం.
  • రావణ సంహారం అనంతరం శ్రీరాముడు ఇక్కడే పదివేల సంవత్సరాలు పాలన చేశాడు అని రామాయణం చెబుతోంది. 
  • అధర్వణ వేదం అయోధ్య దేవనిర్మితమని అది స్వర్గసమానమని పేర్కొన్నది.
  • ఇక్కడ కౌసల్యాదేవి మందిరం ఉంది. ఈ మందిరంలో కౌసల్యాదేవి, దశరథుడులతో రామచంద్రుడు దర్శనమిస్తాడు.
  • హనుమాన్ మందిరం కూడా ప్రఖ్యాతమైనదే.
  • వాల్మీకి మందిరంలో రామాయణంలోని శ్లోకాలను గోడలపై లిఖించారు. ఇక్కడ మూల మందిరంలో వాల్మీకి మహర్షితో లవకుశులు దర్శనమిస్తారు. 
  • మానవ దేహమే అయోధ్య అని, పది ఇంద్రియాలే దశరథుడు అని  యోగులు చెబుతారు.

మధురానగరం 

  • మధుర, బృందావనాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి.
  • ద్వాపరయుగ వాసుదేవుడు పుట్టినచోటు మధుర. 
  • శ్రీకృష్ణ జన్మస్థానమైన  కారాగారాన్ని ఇక్కడ దర్శించవచ్చు, ఇంకా అనేక ఆలయాలున్నాయి. 
  • మధురను దర్శించినవారు తప్పనిసరిగా బృందావనాన్ని దర్శిస్తారు. 
  • మధురను దర్శించిన భక్తులకు బ్రహ్మెక్యానుభూతి లభిస్తుంది.
హరిద్వార్

  • హరిద్వార్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది.
  • పురాణాలలో దీనిని మాయానగరం అని పిలిచారు.
  • శ్రీకృష్ణ జనన సమయానికే యశోదా దేవి గర్భాన మాయ పుట్టింది.వసుదేవుని వెంట మధురకు వచ్చింది. కంసుడు చంపడానికి పైకెత్తగా గాలిలోనే అదృశ్యమైంది. ఆ మాయా దేవి ఆలయం హరిద్వార్ లో ఉన్నది. 
  • దక్షయజ్ఞ సమయంలో సతీదేవి గుండె భాగం పడిన ప్రదేశం ఇదేనని చెబుతారు. 
  • ఈ ఆలయమే కాకుండా శక్తిపీఠాలలో మరో రెండు క్షేత్రాలైన మానసాదేవి, చండీదేవి ఆలయాలు కూడా హరిద్వార్ లో ఉన్నాయి. 
  • చార్ ధామ్ యాత్ర హరిద్వార్ నుంచే ప్రారంభిస్తారు. అనాదిగా హరిద్వార్ తాపసులకు, రుషులకు నెలవుగా వర్ధిల్లుతోంది. 
  • విష్ణుమూర్తి పాదాలు నెలకొని ఉన్నాయని చెప్పే హరికీ పౌరీ గంగానది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ స్నానఘట్టం. 
  • హరిద్వార్ దర్శించినవారు మాయను జయిస్తారని ప్రతీతి. 
కాశీ
  • కాశీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
  • అత్యంత ప్రాచీన భారతీయ నగరాల్లో కాశీ మొదటిది. హిందువులందరికీ పవిత్ర క్షేత్రం.
  • జగాలన్నీ పాలించే విశ్వనాథ కొలువై ఉన్న చోటు కాశీనగరం. 
  • ఉత్తరవాహిని అయిన గంగ ఇక్కడ ప్రవహిస్తోంది. 
  • అన్నపూర్ణా, విశాలాక్షీ సమేతుడై విశ్వనాథుడు ఇక్కడ దర్శనమిస్తాడు.
  • బిందుమాధవుడు క్షేత్ర పాలకుడు కాగా, కాలభైరవుడు కాశీకి రక్షకుడు. 
  • పురాణ కాలం నుంచి కాశీనగరం తపస్సులు స్థావరంగా ఉంది. 
  • గంగ ఒడ్డున ఏభై వరకు స్నానఘట్టాలున్నాయి. 
  • విశ్వనాథ జ్యోతిర్లింగమే మహా  ఆకర్షణ కాశీనగరం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది.
  • కాశీలో మరణించిన వారికి ముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. 
ఉజ్జయిని

  • ఉజ్జయిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
  • పురాణాలు ఉజ్జయినిని అవంతికగా పేర్కొన్నాయి.
  • ఇక్కడ మహాకాళేశ్వరుడు అఘోరమూర్తి .
  • క్షీప్రానది ఒడ్డున హరసిద్ధి మాత యోగినిశక్తులతో నిత్యపూజలు  అందుకుంటూ వుంది.
  • అదే అష్ఠాదశ పీఠాలలో ఒక్కటైనా కాళీ ఆలయం.
  • సతీదేవి పై పెదవి పడిన ప్రదేశం.
  • ఉజ్జయిని కాలేశ్వరుణ్ణి దర్శించిన వారికి నరకబాధలు ఉండవు.

ద్వారక

  • ద్వారక గుజరాత్ రాష్ట్రంలో ఉంది.
  • అనేక ద్వారాలు కలిగిన నగరం కనుక ద్వారకా నగరం అయింది.
  • ఇక్కడ ఉన్న ప్రసిద్ధ ఆలయాన్ని జగత్ మందిరం అంటారు.
  • ఈ ఆలయంలోకి భక్తులు ఒకటి స్వర్గ ద్వారం నుంచి ప్రవేశించి మోక్ష ద్వారం ద్వారా వెలుపలికి వస్తారు.
  • ఈ ఆలయం నుండి గోమతీ నది సముద్రంలో సంగమించే ప్రదేశాన్ని చూడవచ్చు.
  • ద్వారకాపురిలో అనేక ఆలయాలున్నాయి. బేట్ ద్వారక వెళ్ళే మార్గంలో రుక్మిణీ దేవికి ప్రత్యేక ఆలయం ఉంది. 
  • సమీపంలోని దారుకావనం నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంది.
కంచి
  • కంచి తమిళనాడు రాష్ట్రంలో ఉంది.
  • కాంచీ అంటే వడ్డాణం అని అర్థం.
  • కంచి కామాక్షి అమ్మవారు  ఇక్కడ ఏకామ్రనాథుని కోసం తపస్సు చేసి స్వామిని వరించింది. 
  • ఈ స్వామిని పంచభూత లింగాలలో పృధ్వీ లింగంగా పేర్కొంటారు. 
  • కంచి నిండా ఎటుచూసినా ఆలయాలే కనిపిస్తాయి.
  • విష్ణుకంచి లోని వరదరాజ స్వామిని సాక్షాత్తూ చతుర్ముఖ బ్రహ్మయజ్ఞకుండంలో ఆవిర్భవింప చేశాడంటారు.
  • ఇక్కడి వెండిబల్లి, బంగారు బల్లులను ముట్టుకుని వస్తే బల్లిపాటు దోషాలు తొలగిపోతాయంటారు.
  • కంచి మోక్షవిద్యకు మూలపీఠం.