• సంవత్సరంలో శ్రావణ భాద్రపద మాసాలకు  ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది.
  • ఆ రెండు మాసాలలో వర్ష ఋతువు ఉంటుంది.
  • శ్రావణం ఆధ్యాత్మిక మాసం. మంగళ గౌరి పచ్చని గుమ్మాలను వెతుక్కుంటూ వస్తుంది.
  • శ్రావణ మాసమంతా అమ్మవారి మాసమే ఆషాఢంలో గ్రామదేవతలను బోనాలతో  కొలుస్తారు.
  • శ్రావణ మంగళవారం, శుక్రవారం ప్రత్యేక పూజలు చేసుకుంటారు. 
  • అమ్మవారికి నివేదించిన శనగలు, తాంబూలం పళ్ళు పేరంటానికి వచ్చిన ముత్తయిదువలకి వాయనం సమర్పించి వారి దీవెనలు అందుకుంటారు.
  • శ్రావణంలో ప్రతి కదలికలో ఒక సందేశం ఉంది. అవి శారీరక, మానసిక ఆరోగ్యాలను పెంపొందించేవిగా ఉంటాయి.
  • భారతదేశంలో మనం నిర్వర్తించుకునే అన్ని వ్రతాలు, నోములు పండుగలు అటు ప్రకృతిలోనూ, ఇటు ఆరోగ్యంతోనూ ముడిపడి ఉంటాయి. 
  • తడిపొడి చినుకుల శ్రావణంలో కాళ్లకు పసుపు మంచి చేస్తుంది. 
  • వాయనంలోని శనగలు, తాంబూలం, పళ్ళు వాన రుతువు వ్యాధుల నుంచి కాపాడతాయి. అసలు మూలమంత్రంగా భక్తి ఉండనే ఉంది. 
  • మన గ్రామీణ స్త్రీల జీవన విధానాలకు అనుగుణంగా ఈ వ్రతాలు, నోముల్ని మనపూర్వీకులు తీర్చిదిద్దారు.