Ad Code

Responsive Advertisement

శ్రావణ మాసంలో విశేష పర్వదినాలు


శ్రావణ మాసంలో  పర్వదినాలు ఎక్కువగా ఉంటాయి వాటిలో కొన్ని.

శ్రావణ సోమవారాలు :

ప్రతి సోమవారం పరమేశ్వర ప్రీతికరంగా  అభిషేకాలు, అర్చనలు చేస్తారు. శ్రావణసోమవారం శివార్చన, లేదా శివాలయ దర్శనం పరమేశ్వర అనుగ్రహానికి రాచబాటాగా పెద్దలు చెబుతారు.

శ్రావణ మంగళవారాలు :

శ్రావణ మంగళవారాలు ముత్తైదువులు మంగళ గౌరీవ్రతం చేస్తారు. వరుసగా ఐదు సంవత్సరాలపాటు నవవధువులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సౌభాగ్యం కలకాలం ఉంటుంది అని నమ్ముతారు.

శ్రావణ బుధ, గురువారాలు :

బుధ, గురు వారానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. బుధవారం అయ్యప్పకు ప్రీతికరమైనది. గురువారం రాఘవేంద్రస్వామి, దక్షిణమూర్తి, సాయిబాబాకు ప్రీతికరమైన రోజులుగా పరిగణిస్తారు. ఈ రోజున ఆయా దేవతలను, గురువులను కొలిచిన, దర్శించుకున్న సకల శుభాలు కలుగుతాయి.


శ్రావణ శుక్రవారాలు :

ప్రతి శుక్రవారం లక్ష్మీపూజ విశేషంగా చేస్తారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు.

శ్రావణ శనివారాలు : 

కలియుగ దైవం శ్రీనివాసుడికి ఎంతో ప్రీతికరమైన రోజు శనివారం. ఈ రోజున ఉపవాస దీక్షలు చేపడుతారు. స్వామివారికి పుష్పార్చనలు చేస్తారు. తులసీ దళాల మాలలు సమర్పిస్తారు. ఇలా ప్రతి శనివారం చేస్తే కోరిన కోరికలు తీరి శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం.


నాగపంచమి :

శుక్లపక్ష పంచమిని నాగపంచమి అని అంటారు. ఈ రోజు సుబ్రమణ్య స్వామిని పూజిస్తారు.
శుక్ల పంచమిని గరుడపంచమిగా కూడా వ్యవహరిస్తారు. గరుత్మంతుణ్ణి పూజిస్తారు.

శ్రీకృష్ణ అష్టమి :

శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణుడు అవతరించిన పర్వదినం. 

శ్రావణ పూర్ణిమ :

ఇది విశేష ప్రాధాన్యం గల పర్వదినం.

ఉపనయనం చేసుకున్న బ్రహ్మచారులు ఈ రోజు ఉపాకర్మ అనే కార్యక్రమం నిర్వహించి వేద విద్యాభ్యాసం ప్రారంభించటం సంప్రదాయం.

ఈ రోజు ద్విజులు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. ఈ పండుగను జంధ్యాలపూర్ణిమ అని కూడా అంటారు.

అన్నా చెల్లెలు అనుబంధానికి గుర్తుగా ఈ రోజు రక్షాబంధనం జరుపుకోవడం ఆచారం.

శ్రీమహావిష్ణువు హయగ్రీవుడుగా అవతరించిన పర్వదినం శ్రావణపూర్ణిమ. ఈ రోజు హయగ్రీవ జయంతి కావున విష్ణు ఆలయాలు దర్శిస్తారు.

Post a Comment

0 Comments