ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో వుంది. ఈ ఆలయం గోదావరి నది ఒడ్డున వుంది. పూర్వకాలంలో ఇక్కడ మునులు స్నానం చేసేవారట.కోటిలింగాల అంటే ఇక్కడ కోటి శివలింగాలు ఉండవు.

శాతవాహనుల కాలంలో 110 ఎకరాల విస్తీర్ణంలో దీర్ఘచతురస్రాకారంలో ఉన్న పెద్దకోటలో ఒక లింగాన్ని ప్రతిష్టించారు.ఈ కోటలో ఎత్తైన గోడలతో పాటు నాలుగు మూలల్లో ఎత్తైన కోట బురుజులు కూడా ఉంటాయి. వాటి ఈశాన్య మూలన ఉన్న కోట బురుజు శిథిలమై ఎత్తైన గడ్డగా మారిన తర్వాత కాలంలో ఈ గడ్డపైన గుడికట్టి, లింగాన్ని ప్రతిష్ఠించారు. అప్పటినుంచి దాన్నే కోటలింగం అని అనేవారు. ఆ ఆలయమే కాలక్రమేణ కోటిలింగంగా రూపాంతరం చెందింది. అందులో వెలసిన దేవుడు కోటేశ్వరస్వామిగా పిలవబడుతున్నాడు.

ఆలయ వేళలు : ఉదయం 6.00  నుండి మధ్యాహ్నం 12.00 వరకు 
                              సాయంత్రం 5.00  నుండి రాత్రి 8.00 వరకు 

ఎలా వెళ్ళాలి : ఈ ఆలయం హైదరాబాద్ నుంచి దాదాపుగా 220 కిలోమీటర్ల దూరంలో ఉంది.