ప్రదక్షిణ అంటే
ప్ర - బలంగా పాపాల్ని కొట్టి తరిమేసేది
ద - సకల కోరికలనీ తీర్చేది
క్షి - కర్మ ఫలితాలని క్షీణింప చేసేది
ణ - ముక్తి ప్రదాయకమైనది అని అర్థం.
- కైలాసవాసుడైన పరమేశ్వరుడు అగ్నిలింగంగా అరుణాచలం రూపంలో భూమిమీద వెలిసాడు.
- ఆ దివ్య పర్వతం చుట్టూ ఎంతో మంది దేవతలు పరివేష్టించి ఉన్నారు.
- జన్మాంతరాల్లో చేసిన పాపాలు అన్ని కూడా ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే నశించిపోతాయి.
- కోటి అశ్వమేధయాగాలు, కోటి వాజపేయ యాగాలు చేస్తే వచ్చే ఫలితం, సర్వతీర్థాలలో స్నానం చేస్తే వచ్చే ఫలితం, కేవలం ఒక్కసారి అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కలుగుతుంది.
- ఎంత నికృష్ట జన్మ ఎత్తిన వారికైనా సరే, అరుణగిరి ప్రదక్షిణ ముక్తిని ప్రసాదిస్తుంది.ఆ గిరికి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేసేవారు, సకల యజ్ఞాలు చేసిన ఫలం పొందుతారు.
- అరుణాచల ప్రదక్షిణ కోసం వెళ్ళేవారు ఒక్క అడుగు వేసినంత మాత్రాన్నే భూలోకాన్ని, రెండో అడుగుతో అంతరిక్షాన్ని, మూడో అడుగుతో స్వర్గాన్ని పొందుతారు.
- అలాగే మొదటి అడుగుతో మానసికంగా చేసిన పాపం, రెండవ అడుగుతో వాక్కుద్వారా చేసిన పాపం, మూడో అడుగుతో శరీరం ద్వారా చేసిన పాపం తొలగిపోతుంది. ఒక్కడుగుతో సకల పాపాలూ నశిస్తాయి.
- రెండో అడుగు వేస్తే సర్వతపస్సుల ఫలితం వస్తుంది.
- పరమపవిత్రమైన ఈ అరుణగిరి చుట్టూ ఎన్నో సిద్ధాశ్రమాలున్నాయి.ఈ శిఖరం మీదే సర్వేశ్వరుడు సిద్దేశ్వర రూపంతో, దేవతలంరిచేతా పూజించబడుతుంటాడు.
- “ఈ దివ్య పర్వతం అగ్ని మయమని, ఈ పర్వతం అంతర్భాగంలో సర్వభోగాలతో కూడిన ఒక గుహ ఉందని భావిస్తూ ధ్యానిస్తూ ఈ గిరికి ప్రదక్షిణ చేయాలి. అలా చేసిన వారి పాపాల్ని దోషాల్ని తొలగిస్తానని పరమేశ్వరుడు స్వయంగా చెప్పాడు.
- ఈ గిరికి నిత్యం ప్రదక్షిణ చేసేవారికి నిత్యత్వం లభిస్తుంది.ఈ గిరికి ప్రదక్షిణ చేసేవాడి పాదధూళితో భూమి పవిత్రమవుతుంది.
ప్రదక్షిణ ఎలా చేయాలి ?
- ప్రదక్షిణ చేసేవాళ్ళు ఎవరు చేతిని పట్టుకోకుండా నెమ్మదిగా నడవాలి
- పరుగులు తీస్తూ హడావుడిగా గిరిప్రదక్షిణ చేయకూడదు,నడిచేవారి అడుగుల చప్పుడు కూడా వినపడకూడదు.
- స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి, భస్మాన్ని, రుద్రాక్షల్ని ధరించి పవిత్రంగా ప్రదక్షిణ చేయాలి.
- ఈ పవిత్రమైన గిరిప్రదక్షిణని మనువులు, సిద్ధులు, మహర్షులు, దేవతలు అదృశ్యరూపంలో చేస్తారు. ఇది గ్రహించి వారి దారికి తాము అడ్డులేకుండా నడవాలని భావిస్తూ తమ ప్రదక్షిణ కొనసాగించాలి.
- శివనామ సంకీర్తన చేస్తూ భక్తులతో కలిసి వెళ్ళాలి.
- మనసులో ఓం అరుణాచలేశ్వరాయ నమః అన్న నామాన్ని నిరంతరాయంగా జపిస్తూ ముందుకి సాగాలి.
- కృతయుగంలో అగ్నిమయం, త్రేతాయుగంలో మణిమయం, ద్వాపర యుగంలో బంగారుమయం, కలియుగంలో మరకతాచలంగా ఈ అరుణగిరి వుండేదని భావించాలి.
- పవిత్రమైన అరుణాచలం స్ఫటిక మయమని, స్వయంప్రభామయమైనదని ధ్యానిస్తూ ప్రదక్షిణ చేయాలి.
పరమేశ్వరుని అగ్నిమయ స్వరూపుడిగా భావిస్తూ ప్రదక్షిణ చేసేవారిని అయన సర్వదా రక్షిస్తాడు.
ఈ గిరిప్రదక్షిణ చేసేవాడి పాదాలు మోయటానికి దేవతలా వాహనాలు పోటీపడుతుంటాయి.
ఈ గిరిప్రదక్షిణ చేసినవారికి దృఢమైన శరీరం ఏర్పడుతుంది. వారి వ్యాధులు నశిస్తాయి.
అదృశ్యంగా ఈ గిరిప్రదక్షిణ చేసే దేవతలు తమతో పాటు ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు వరాల్ని ప్రసాదిస్తారు.
దుర్బలులు, కృశించిన శరీరం కలిగిన వారు ఎలాగో శ్రమపడి ఈ గిరి ప్రదక్షిణ చేస్తే, సకల దోషాల నుంచీ పాపాల నుండి విముక్తులవుతారు.
అరుణగిరి ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే, ముల్లకాలకీ ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది.
ఉత్తరాయణ పుణ్యకాలంలో (మకర సంక్రమణం) పరమేశ్వరుడు స్వయంగా తన ప్రమధగణాలతో, ఋషి ముని సమూహాలతో ఈ గిరికి ప్రదక్షిణ చేస్తాడు.
ఉత్తరాయణ పుణ్యకాలంలో అరుణగిరికి ప్రదక్షిణ చేసే వారిని, జగన్మాత పార్వతీదేవి కరుణించి కాపాడుతుంది.
పవిత్రమైన అరుణగిరి ప్రదక్షిణని రథాలు, గుర్రాలులాంటి వాహనాలతో చేయకూడదు. కేవలం కాలినడకతోనే చేయాలి.
దుర్బలులు, కృశించిన శరీరం కలిగిన వారు ఎలాగో శ్రమపడి ఈ గిరి ప్రదక్షిణ చేస్తే, సకల దోషాల నుంచీ పాపాల నుండి విముక్తులవుతారు.
అరుణగిరి ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే, ముల్లకాలకీ ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది.
ఉత్తరాయణ పుణ్యకాలంలో (మకర సంక్రమణం) పరమేశ్వరుడు స్వయంగా తన ప్రమధగణాలతో, ఋషి ముని సమూహాలతో ఈ గిరికి ప్రదక్షిణ చేస్తాడు.
ఉత్తరాయణ పుణ్యకాలంలో అరుణగిరికి ప్రదక్షిణ చేసే వారిని, జగన్మాత పార్వతీదేవి కరుణించి కాపాడుతుంది.
పవిత్రమైన అరుణగిరి ప్రదక్షిణని రథాలు, గుర్రాలులాంటి వాహనాలతో చేయకూడదు. కేవలం కాలినడకతోనే చేయాలి.
0 Comments