ఈ గిరిప్రదక్షిణ ప్రతిరోజు చేస్తూ ఉంటారు. కానీ ఏ వారం చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి తెలుసుకుందాం.

ఆదివారం : ఈ రోజు అరుణగిరి ప్రదక్షిణ చేసినవారు శరీర పతనానంతరం సూర్యమండలాన్ని ఛేదించుకుని యోగులలాగా శివలోకాన్ని చేరుకుంటారు

సోమవారం : శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం నాడు ఈ గిరిప్రదక్షిణ చేస్తే అజరామరత్వప్రాప్తి కలుగుతుంది.

మంగళవారం : శుభప్రదమైన మంగళవారం నాడు చేసే అరుణగిరి ప్రదక్షిణ వల్ల సార్వభౌమాధికారం ప్రాప్తిస్తుంది.

బుధవారం : జ్ఞానప్రదమైన ఈ వారంలో గిరిప్రదక్షిణ చేసేవారికి సర్వజ్ఞత్వం మహాపాండిత్యం లభిస్తాయి

గురువారం : గురుసంబంధమైన ఈ వారంలో ప్రదక్షిణ చేసిన వారికి సకల దేవతలూ నమస్కరించతగ్గ గురుత్వం ప్రాప్తిస్తుంది.

శుక్రవారం : మంగళ ప్రదమైన ఈ వారంలో గిరిప్రదక్షిణ చేసేవారికి విష్ణులోకం లభిస్తుంది .

శనివారం : అత్యంత ప్రభావవంతమైనది శనివార ప్రదక్షిణ. ఈ రోజు అరుణగిరికి ప్రదక్షిణ చేసేవారికి సకల గ్రహబాధలు తొలగిపోయి అన్ని కార్యాలలో విజయం లభిస్తుంది.

పూర్వం ఎంతోమంది నక్షత్ర దేవతలు, గ్రామ దేవతలు ఈ గిరి ప్రదక్షిణ చేసి, శివానుగ్రహాన్ని పొందారు. అన్ని తిథులు, యోగాలు, కరణాలు, సకల ముహూర్తాలు, హోరలు, సౌమ్యాలు అన్నీ అరుణగిరి ప్రదక్షిణ చేసేవారికి అత్యంత సానుకూలంగా 
ఉంటాయి.