• ఆషాడ పూర్ణిమను సింహాచలంలో గిరిపున్నమిగా వ్యవహరిస్తారు.
  • అక్షయ తృతీయ నుంచి నాలుగు విడతలుగా చందన సేవను స్వీకరించిన స్వామి ఆషాడపౌర్ణమి నాటికీ సంపూర్ణ రూపాన్ని దరిస్తాడు.
  • నృసింహ మూర్తులు 32 ఉన్నట్లు మనకు పురాణాలు చెబుతున్నాయి.నృసింహ బీజాక్షరాలతో కూడిన మహామంత్రంలో 32 అక్షరాలుంటాయి.
  • సింహాచలం క్షేత్రం కూడా సరిగ్గా 32 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగివుంటుంది. 
  • విష్ణువు పర్వతాలకు అధిపతి. 
  • సింహాచల పర్వతానికి ఆషాడ పూర్ణిమనాడు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ గిరికి మూడు సంవత్సరాల పాటు ఆషాఢపూర్ణిమ నాడు ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ ఫలం లభిస్తుంది అని పెద్దలు చెబుతారు.
  • చతుర్విధ పురుషార్థాలు పొందుతామని, చక్కటి సంతానం కలుగుతుందని చెబుతారు.
  • వైశాఖమాసంలో అక్షయతృతీయ నాడు స్వామివారి  నిజరూపదర్శనం భక్తులకు లభిస్తుంది.స్వామివారికి చందన సమర్పణ ఈ పౌర్ణమి నాటికి పరిపూర్ణమైన ఆకారాన్ని దరిస్తాడు. 
  • అలా పరిపూర్ణుడైన స్వామి కొలువైన కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. అంతులేని పుణ్యం కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి.
  • గిరిప్రదక్షిణ, భూప్రదక్షిణ అనేవి తపస్సుతో సమానం.

2021 : జులై 23.