యాత్రకు బయలుదేరేవారికి, లేదా ఏదైనా పనిమీద పొరుగూరికి ప్రయాణమయ్యే వారికి-తెల్లటి వస్త్రాలు, మంచినీళ్ళు, ఫలాలతో నిండిన వృక్షం, నిర్మలమైన ఆకాశం, పొలంలో పెరిగిన సస్యం, నల్లధాన్యం కనబడటం అశుభ సూచకాలు.
అలాగే దూది, పిడకలు, సుత్తిబొగ్గులు, బెల్లం, గుండుకొట్టించుకున్న వాడు, ఇనుము, బురద, చర్మం, వెంట్రుకలు, పిచ్చివాడు, నపుంసకుడు చండాలుడు, కారాగారాధికారి, గర్భిణీ స్త్రీ, విధవ, తెలకపిండి, మృత్యువు, ఊక బూడిద, నిప్పులు, ఎముకలు, పగిలిన పాత్రలు-ఇవి కనబడితే అశుభం.
ఎక్కడికి వెళుతున్నావు? ఆగు? వెళ్ళకు? అక్కడికి వెళితే నీకేం లాభం ఇలాంటి మాటలు ఎవరైనా అంటే అది అశుభసూచకంగా గ్రహించాలి. ఇలాంటి అపశకునాలు కనిపించినప్పుడు సకల శుభకారకుడైన శ్రీహరిని ప్రార్ధించాలి. తరువాత తిరిగి బయలుదేరేడప్పుడు రెండో సారికూడా అశుభశకునాలు కనిపిస్తే ఇక ఆ ప్రయాణం ఏమాత్రం శ్రేయస్కరం కాదని గ్రహించి మానుకోవాలి.
0 Comments