- హోలీ పండుగను ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటారు.
- దీనిని హోళికా పూర్ణిమ అని, కాముని దహనోత్సవం అని కూడా పిలుస్తారు
- కృతయుగంలో రఘుమహారాజు కాలంలో డుంఢి అనే రాక్షసి పీడ ఈ పౌర్ణమి రోజున విరగడైంది అని, అందుకు గుర్తుగా హెలిమంటలు వేయాలని కధనం
- ఈ డుంఢి చిన్నపిల్లలకు పీడకరమైన దుస్థురాలు అని చెప్పబడింది
- ఈ రోజు శివుడిని, శ్రీ కృష్ణభగవానుడిని పూజించాలి
- కొన్ని చోట్ల ఈ రోజుని డోలాపూర్ణిమ పేరుతో డోలోత్సవం చేస్తారు
- ఒడిశాలో శ్రీకృష్ణభగవానుడిని ఉయ్యాలలో నెలకొల్పి పూజిస్తారు. ఉయ్యాలలో పూజింపబడిన శ్రీకృష్ణుని దర్శిస్తే వైకుంఠప్రాప్తి లభిస్తుంది అని గ్రంధాల ద్వారా తెలుస్తుంది.
- ఈ రోజు లింగపురాణం దానంచేస్తే శివలోక ప్రాప్తి కలుగుతుంది అని పురాణ వచనం
- తరువాతి రోజు అనగా ఫాల్గుణ బహుళ పాడ్యమి రోజున వసంతోత్సవం జరుపుకోవాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి.
2021 : మార్చి
0 Comments