Ad Code

Responsive Advertisement

బ్రహ్మంగారి కాలజ్ఞానం - 2

బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి , భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే చెప్పినారు వాటిని కాలజ్ఞానంగా చెబుతారు. 


మాతకలహాలు చుట్టుముడతాయి 

అగ్ని వెన్నెలలా చల్లగా ఉంటుంది.

అర్ధరాత్రి సమయంలో గ్రామాలలో కేకలు వినబడుతాయి.

ఆచార వంతులు, అనాచారులై పోతారు 

నా రాకకు ముందు దుష్టులు నశిస్తారు. 

శ్రీశైల తీర్థం నశిస్తుంది. శ్రీశైల మల్లికార్జునుడు మానవులతో మాట్లాడుతాడు.

అయిదు సంవత్సరాల కుర్ర నాగన్న అయిదు వేదాలు చదువుతాడు

ఉరికొక గురువు అవతరిస్తాడు. 

దొమ్మరలు దొరలు అవుతారు

సూర్య చంద్రులు గతులు తప్పుతారు 

నెల్లూరు నీట మునుగుతుంది. నాలుగు దిక్కులా నుండి నలుగురు పుట్టి దేశముమీద కొచ్చెదరు. 

ఈశాన్య దిక్కున విషగాలి, మడికొండ వద్ద సుడిగాలి పుట్టి కొందరు చచ్చిపోతారు.

ఆచారాలు నశిస్తాయి. అనాచారము పెరిగిపోతుంది 

వావివరసలు, తారతమ్యాలు మంట కలిసిపోతాయి 

ఒకరి శ్రమ ఇంకొకరి పాలవుతుంది.

కామక్రోధాలు మితిమీరిపోతాయి, ధర్మము నశించిపోతుంది.

నవాబు పాలన నశించిపోతుంది. ఆదాయము తగ్గిపోతుంది.

కుంభకోణంలో గుడి కూలిపోయి మూలవిరాట్ రూపము మాసిపోతుంది.

జగన్నాధుడు చంద్రగిరిని చేరుతాడు.

ఐదేళ్ల పిల్లలు భవిష్యత్తును చెపుతారు. 

Post a Comment

0 Comments