- పారిజాత వృక్షం సముద్ర గర్భం నుంచి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి.
- ముఖ్యంగా ఈ పారిజాత పుష్పాలతో విష్ణు దేవుడిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని భావిస్తారు.
- దేవతలు రాక్షసులు అమృతం కోసం సాగర మధనం చేస్తున్న సమయంలో సముద్ర గర్భం నుంచి ఈ వృక్షం పంపించగా పారిజాత వృక్షాన్ని విష్ణుమూర్తి స్వర్గానికి తీసుకువెళ్లారు. స్వర్గం మొత్తం ఈ పుష్పాల పరిమళాలతో విరాజిల్లింది.
- అయితే సత్యభామ కోరికమేరకు స్వర్గం నుంచి విష్ణువు పారిజాత వృక్షాన్ని భూమిపైకి తీసుకువచ్చారని పురాణాలు చెబుతున్నాయి.
- సాధారణంగా మనం దేవుడికి పువ్వులతో పూజ చేసే సమయంలో కిందపడిన పుష్పాలతో పూజ చేయకూడదని చెబుతాము.
- ఈక్రమంలోనే చెట్టుపై నుంచి పువ్వులను కోసి భగవంతుడికి అలంకరించి పూజిస్తాము.
- అయితే పారిజాత పుష్పాలను పొరపాటున ఎప్పుడూ కూడా చెట్టునుంచి కోయకూడదు.
- ఈ పుష్పాలు రాత్రి సమయంలో వికసించి తెల్లవారే సమయానికి నేలపై రాలుతాయి.ఈ విధంగా రాలిన పుష్పాలతో పూజ చేయాలి.
0 Comments