Ad Code

Responsive Advertisement

శ్రీ వింజేటమ్మతల్లి దేవాలయం - వింజమూరు

వింజేటమ్మ అనగా వింజమూరు గ్రామానికి గ్రామ దేవత. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా లోని ఒక మండల కేంద్రం. 

ఈ అమ్మవారు పార్వతీదేవి అవతారంగా భావిస్తారు.

గ్రామానికి దక్షిణం దిక్కున గల కొండపై వెలసియున్న శ్రీ వింజేటమ్మతల్లి దేవాలయం చాలా ప్రాచీనమైనది. 

ఈ కొండ వద్ద ఎవరు నివాసం లేనప్పటికి ఈ కొండ చుట్టూ ఉన్న ఎనిమిది గ్రామాలతో కలిపి కొండ తొమ్మిది పల్లెలుగా ప్రసిద్ధి పొందింది.

కొండపైన, కొండ కింద ఉన్న దేవాలయాలు శిథిలమై పోవడంతో కొండ కింద దాతల సహాయంతో నూతన దేవాలయాన్ని నిర్మించారు.

శ్రీ వింజేటమ్మతల్లిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ముందుగా నాలుగు వేపచెట్ల మధ్య ఉన్న నాగులపుట్టను దర్శిస్తారు.

ఇక్కడకి వచ్చే భక్తుల కోర్కెలు నెరవేరుతుండటంతో శ్రీ వింజేటమ్మతల్లిని వరాల కల్పవల్లిగా అభివర్ణిస్తారు.

ఇక్కడ ప్రతి శుక్రవారం, పండుగలకు ప్రత్యేక సందర్భాలలో అన్నదానం జరుగుతుంది.

శివరాత్రి, దసరా, శ్రీ వింజేటమ్మతల్లి తిరునాళ్ళ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.


పురాణాల ప్రకారం

హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తిరిగి యదాస్థానంలో ఉంచడానికి తీసుకుని వెళ్తున్న సమయంలో ఒక పెళ్ల విరిగి ఇక్కడ పడిందని పెద్దలు చెప్పుతుంటారు.

నెల్లూరు నుండి 75 కి.మీ దూరం.

Post a Comment

0 Comments