ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని కోలూరు జిల్లా ముళబాగిలు సమీపంలో ఉంది. ఇక్కడ శక్తిగణపతిగా స్వామి వారు కొలువై ఉన్నారు.
సుమారు 14అడుగుల ఎత్తున్న ఈ భారీ విగ్రహం, ఏక సాలగ్రామ శిలతో తయారుచేశారు. ఈ విగ్రహాన్ని స్వయంగా త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు,మహేశ్వరుడు)ప్రతిష్టించారని ప్రతీతి.
ఈ ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతుంది.
కురుడుమలె గణపయ్యను దర్శించుకుని పని మొదలుపెడితే ఆ కార్యం నిర్విఘ్నంగా నెరవేరుతుందంటారు.
ఈ ఆలయం విశిష్టత ఏంటే మనం అనుకుంటే ఇక్కడకు వెళ్లలేమట,కేవలం లంబోదరుడి అనుగ్రహం ఉంటేనే వెళ్లగలం అని చెబుతారు.
ఈ ఆలయం సమీపంలో సోమేశ్వరస్వామివారు కూడా కొలువై ఉన్నారు.
కౌండిన్య మహాముని ఈ ప్రాంతంలో నేటీకి ఉన్నారని, ప్రతిరోజూ రాత్రిసమయంలో వచ్చి స్వామిని దర్శంచుకుంటారని, అక్కడి వారికి అపారమైన నమ్మకం.
ఎందుకంటే ఇప్పటికీ అర్థరాత్రి సమయంలో గుడిలోపలి నుంచి స్త్రోత్రాలు వినిపిస్తాయని, ఓంకారం ప్రతిధ్వనిస్తుందని, పర్వదినాలలో దేవతలంతా వచ్చి స్వామిని సేవిస్తారని చెబుతుంటారు.
స్థలపురాణం
త్రిపురాసుర సంహారానికి ముందు త్రిమూర్తులు ఈ గణపతిని పూజించి కార్యవిఘ్నాలు తొలగించుకున్నారని త్రేతాయుగంలో ఈ స్వామిని సేవించి రాముడు లంకకు పయనమయ్యాడని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు స్వామిని సేవించాడని, పాండవులు కూడా ఈ శక్తి గణపతిని సేవించారని అక్కడి స్థలపురాణం. లంబోదరుడు స్వయంగా శ్రీకృష్ణదేవరాయలు కలలో కనిపించి ఆ గుడికి ప్రాకారం నిర్మించమని చెప్పినట్టు అక్కడుకున్న శిలాశాసనాలు స్పష్టం చేస్తాయి. అప్పట్లో దీన్ని కూటాద్రి అని పిలిచేవారని కాలక్రమంలో అది కాస్త కురుడుమలెగా పేరుగాంచిందని చెబుతున్నారు.
ఆలయ వేళలు
ఉదయం 07.00 నుండి మధ్యాహ్నం 1.00 వరకు
సాయంత్రం 03.00 నుండి రాత్రి 08.00 వరకు
బెంగళూరు నుండి 110 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం
0 Comments