తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 1 నుండి 5వ తేదీ వరకు తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఐదు రోజులపాటు జరిగే తెప్పోత్సవాలలో మొదటిరోజైన జనవరి 1న శ్రీ వినాయక స్వామివారు మరియు శ్రీ చంద్రశేఖర స్వామివారు పుష్కరిణిలో ఐదు చుట్లు విహరిస్తారు. రెండవ రోజు శ్రీ వల్లి, దేవసేన సమేత సుబ్రమణ్యస్వామివారు ఐదు చుట్లు, మూడవ రోజు శ్రీ సోమస్కందస్వామివారు ఐదు చుట్లు, నాలుగో రోజు శ్రీ కామాక్షి అమ్మవారు ఏడు చుట్లు, ఐదో రోజు శ్రీచండికేశ్వరస్వామివారు, శ్రీ చంద్రశేఖర స్వామివారు తెప్పలపై తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.
జనవరి 6వ తేదీన ఆరుద్ర దర్శన మహోత్సవం సందర్భంగా ఉదయం 5.30 నుండి 8.30 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారు, శ్రీ శివగామి అమ్మవారు, శ్రీ మాణిక్యవాసగ స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధులలో ఊరేగించనున్నారు.
0 Comments