Ad Code

Responsive Advertisement

2023: యాదాద్రి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిసన్నిధిలో ముక్కోటి ఏకాదశి పర్వాల నిర్వహణకు అధికారులు ముందస్తుగాఏర్పాట్లు ప్రారంభించారు. ఆలయ ఉద్దాటన అనంతరం తొలిసారి ముక్కోటి(వైకుంఠ) ఏకాదశి రోజు ఉత్తర ద్వారంలో వైకుంఠనాథుడుగా లక్ష్మీనృనింహుడు దర్శన మివ్వనున్నాడు. ఆలయ విస్తరణకు ముందు ప్రధానాలయ తూర్పు రాజగోపురం చెంత మాత్రమే పరమపధనాథుడిగా స్వామివారి అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చి తరింపజేసేవాడు. ఆలయ పునర్నర్మాణంలో భాగంగా గర్భగుడికి నాలుగు వైపులా పూర్తిగా కృష్ణరాతి శిలలతోవంచతల రాజగోపురాలను నిర్మించారు. దీంతో ఈసారి ముక్కోటి ఏకాదశిరోజున రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశవిదేశాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చే భక్తులు ఏకశిఖరవానుడు లక్ష్మీనృసింహుడిని పరమపధనాథుడి అలంకారంలో దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ముక్కోటి పర్వాల నిర్వహణ కోసం ఏర్పాట్లను ముందస్తుగానే ప్రారంభించారు.  శ్రీవైష్ణవ ఆలయాల్లోముక్కోటి వేడుకలకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుందని, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా వైభవంగా ఏర్పాట్లు చేయనున్నారు.


యాదగిరీశుడి సన్నిధిలో, అనుబంధ పాతగుట్ట ఆలయంలో జనవరి 2వతేదీన ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రపద్ధతిలో వైభవంగా నిర్వహిస్తారు.'


కైంకర్యాలను నైతం ముందస్తుగానే ప్రారంభిస్తారు. ఈ ఏడు కొండపైన,అనుబంధ పాతగుట్ట ఆలయాల్లోనూ ఉత్తర ద్వారం చెంతే స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తుల దర్శనానంతరం స్వామివారి అలంకార సేవ ఆలయ తిరువీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ముక్కోటిఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే నకల పాపాలు హరిస్తాయని, సిరి  సంపదలు సంప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

యాదగిరీశుడి సన్నిధిలో జనవరి 2వ తేదీ నుంచి జనవరి 7 వ తేదీ వరకు ఆరు రోజుల పాటు అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. ఆరు రోజుల పాటు మొక్కు శాశ్వత కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహోమంతో పాటు లక్షపుష్పార్సన పూజలు నిలిపిస్తారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉదయం, సాయంత్రం స్వామివారు దశావతారాల్లోవివిధ అలంకార సేవల్లో భక్తులకు దర్శనమిచ్చి తరింపజేయనున్నాడు.

Post a Comment

0 Comments