భారతదేశంలోని దక్షిణం వైపు కొలువు దీరిన అష్ట భార్యా సమేత శ్రీకృష్ణుడి విగ్రహాలు ఉన్న ఆలయం కరీంనగర్ లోని రామడుగులో ఉంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం కొద్ది కాలం పాటు మరుగున పడగా తిరిగి భక్తులు ఆలయ పూజారుల చొరవతో  దీప ధూప నైవేద్యాలను అందుకుంటోంది.


త్రేతాయుగంలో అరణ్యవాసంలో భాగంగా శ్రీరాముడు కాలు పెట్టిన చోటుగా రామడుగు మండలానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రధాన రహదారికి సమీపంలో భాగంగా ఎడమ వైపున దక్షిణాభి ముఖంగా వెలిసిన శాపురం వేణు గోపాలుడు అష్ట భామలతో దర్శనం ఇస్తాడు. వెయ్యి సంవత్సరాలకు పూర్వం ఈ ఆలయం వెలిసి ఉంటుందని భావిస్తున్నారు. ఇలా 8 మంది భార్యలతో కొలువుదీరి కనిపించే వేణుగోపాల వేణుగోపాల స్వామి ఆలయం దేశంలో మరి ఇక్కడ లేదు.


గర్భగుడి ద్వారానికి ఇరు వైపులా స్వామి ద్వారపాలకులైన జయ విజయులు ఉన్నారు. సింహద్వారం ఎదురుగా గరుడాళ్ వారు ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకులై వేశారు.స్వామివారి వెనుక భాగంలో అశ్వత వృక్షం ఉండటం మరో ప్రత్యేకత. అశ్వత నారాయణుడు సంతానాన్ని ప్రసాదించే దేవుడు కావడంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించడం అంటే శ్రీకృష్ణ లీలలను గుర్తు చేసుకున్నట్టే.


కరీంనగర్ జిల్లా కేంద్రానికి సుమారు 20 కిలో మీటర్ల దూరంలో రామడుగు మండల కేంద్రం జగిత్యాలకు వెళ్లేదారిలో వెదిర నుంచి కుడివైపు 10 కిలోమీటర్లు వెళ్లగానే ఈ ఆలయం ఉంటుంది.