Ad Code

Responsive Advertisement

శ్రీ చక్రకాళి ఆలయం - వందలూరు, తమిళనాడు

 తమిళనాడులో రత్నమంగళంలో శ్రీ లక్ష్మి కుబేరుల ఆలయం పక్క సందులోనే వున్నది ఈ శ్రీ చక్రకాళి ఆలయం.  ఈ ఆలయాలన్నీ దాదాపు ఒకే విధంగా వున్నాయి.  మరీ పెద్దవి కావు, మరీ చిన్నవి కావు.

  

కానీ ప్రత్యేక శక్తులు కలిగినవిగా పేర్కొనబడుతున్నాయి.  అన్నీ నూతన ఆలయాలే. శ్రీ చక్రకాళి ఆలయంలో అమ్మవార్ల విగ్రహాలు రెండు వున్నాయి.  వెనక వున్న పెద్ద విగ్రహం శ్రీ భవతారిణిది. 


ఈ విగ్రహం ఒకే రాతిలో మలచబడ్డ 12 అడుగుల అద్భుతమైన విగ్రహం.  భవతారిణి అంటే భవ బంధాలనుంచీ తరింప చేసేది, ప్రపంచాన్ని రక్షించేది.ఆ విగ్రహానికి ముందు వున్న చిన్న విగ్రహం శ్రీ చక్రకాళి.  


ఈవిడ పంచ భూతాలను తన త్రిశూలంతో అదుపులో వుంచుతుంది.


ఇక్కడ రెండు మేరులున్నాయి.  ఒకటి శ్రీ లలితా మహామేరు...అన్ని ఆలయాలలో చూడవచ్చు.  రెండవది దక్షిణ కాళి మహా మేరు.  కేవలం ఇక్కడే వున్నది.  


ఈ అమ్మ ప్రజలని రక్షించటమేగాక, అవసరాన్నిబట్టి శిక్షిస్తుంది కూడా.  అందుకే ఇక్కడ అనుకూల, ప్రతి కూల శక్తులకు పూజలు చేస్తారు.  జీవితంలో రెండూ కావాలి.  


దక్షిణ కాళి పంచ భూతాలను తన త్రిశూలంతో అదుపు చేసి ప్రజలకు ఎప్పుడు ఏమి కావాలో ఇస్తుంది.  ప్రపంచంలో మంచిని ఎలా కాపాడుతుందో, అలాగే ఒక్కొక్కసారి విపరీతాలను సృష్టించి ప్రకృతిలోని సమతుల్యాన్ని కూడా కాపాడుతుంది. 


ఇందులో లలితా మేరు పెద్దది.  దక్షిణ కాళి మేరు బాగా చిన్నది. ఈ విగ్రహాలకి కింద వరుసగా మహా గణపతి, మహాలక్ష్మి, మహా కాళి, రెండు మేరులు, మహా సరస్వతి, చాముండేశ్వరి, కార్తికేయన్ లు పూజలందుకుంటున్నారు.


అమ్మవారికి చక్ర పొంగలి నైవేద్యం పెడతారు.  అమ్మవారి ముందు పెద్ద పళ్ళెంలో చక్ర పొంగలి పెడితే, అందులో అమ్మవారి ఆకారం ప్రతి బింబిస్తుంది. 

భక్తులు ఈ ఉత్సవానికి విరివిగా వస్తారుట.  తర్వాత ఆ పొంగలిని ప్రసాదంగా పంచి పెడతారు.


దర్శన సమయాలు


ఉదయం 6గం. ల నుంచీ 12 గం. ల దాకా, తిరిగి సాయంత్రం 4-30 నుంచీ 8 గం. ల వరకు 


చెన్నై నుండి 36 కి.మీ దూరం 

Post a Comment

0 Comments